వైఎస్ వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్ ఒకటి తెరపైకి వచ్చింది. వివేకా రెండో భార్య షేక్ షమీమ్ CBIకి ఇచ్చిన స్టేట్మెంట్ తో మరికొన్ని నిజాలు బట్టబయలయ్యాయి. ఈ కేసును త్వరగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు సీబీఐకి ఆదేశించినప్పటి నుంచి.. కేసులో వేగం పుంజుకుంది. అయితే సీబీఐ ఇప్పటి వరకు విచారించని కోణంలోకి కీసు పూర్తిగా టర్న్ అయ్యింది. ఇప్పటి వరకు సీబీఐ రాజకీయ కోణంలోనే విచారించింది. టార్గెట్ అవినాష్ రెడ్డి అన్న విధంగానే సీబీఐ విచారణ కొనసాగించింది. అయితే.. సీబీఐ దర్యాప్తును చాలా మంది తప్పుబడుతూ వచ్చారు. ఇప్పుడు వివేకా రెండో భార్య షేక్ షమీమ్ ఇచ్చిన స్టేట్మెంట్ తో కీసు కీలక మలుపు తిరిగే ఛాన్స్ ఉంది. ఆస్తి తగాదాలే వివేకా హత్యకు.. కారణమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకా చనిపోవడానికి గంట ముందు తనతో మాట్లాడారని, బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్లో 8 కోట్లు వస్తుందని.. అది తన కొడుకు పేరు మీద భూమి కొంటానని చెప్పారని షమీమ్ కొన్నినిజాలు బయట పెట్టారు. అంతేకాదు.. తన కొడుకు షహన్షా పేరు మీద 4 ఏకరాల భూమి కొందామని వివేకా అనుకున్నారు.. కానీ శివ ప్రకాష్ రెడ్డి ఆపేశాడని షేక్ షమీమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఈ కేసు అటుఇరిగి.. ఇటు తిరిగి సునీత దంపతులకు మరింత ఉచ్చు బిగుసుకుంకుంటుంది. మరోవైపు షేక్ షమీమ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. తన పేరిట, తన కొడుకు పేరిట వివేకానందరెడ్డి రాసిన వీలునామా ప్రకారం రావాల్సిన ఆస్తిని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ కుమార్తె సునీత ఇప్పించాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.