వైఎస్ వివేకా కేసులో కడప ఎంపీ అవినాశ్ పై సీబీఐ కావాలనే టార్గెట్ చేస్తోందా…? ఈ కేసులో ఎంపీ అవినాశ్ ను ఇరికించాలనే.. సీబీఐ ఆరోపణలు చేస్తోందా..? ఎంపీని అరెస్టు చేయాలని పచ్చ మీడియా పదేపదే ఎందుకు ప్రచారం చేస్తోంది…? దోషులు బయట ఉండి.. నిర్దోషులు జైలులో మగ్గుతున్నారా..? హత్యకేసులో ఏ1 నిందితుడుగా ఉన్న ఎర్రగంగిరెడ్డిని కలవాల్సినంత అవసరం సునీతకు ఏమొచ్చింది..? సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టు.. ఎల్లో మీడియా స్క్రిప్ట్ ప్రకారమే సీబీఐ దర్యాప్తు చేస్తోందా..? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. నేడు అవినాష్ బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగిన నేపధ్యంలో సీబీఐ, సునీతపై హైకోర్టు సీరియస్ అయ్యింది. లేనిపోని ఆరోపణలు చేసి, ఆధారాలు లేని పీటీషన్లు వేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడింది. వివేకా హత్యకు మూడు నెలల ముందే ప్లాన్ చేశారని, ఆ సంగతి సిఎం జగన్ కి కూడా తెలుసని సీబీఐ చెప్పడం పలు చర్చలకు దారి తీస్తోంది. ఇక ఇదే వార్తను abn గతంలో ఎప్పుడో ప్రచారం చేసింది. ప్రస్తుతం ఇదే అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సజ్జల రామకృష్ణ అన్నట్టు.. నిజంగానే ఎల్లో మీడియా స్క్రిప్ట్ ప్రకారమే సీబీఐ వ్యవహరిస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే.. ఎల్లో మీడియా, సీబీఐ ఫాలో అవుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సునీత పదేపదే ఇంప్లీడ్ పీటీషన్లు వేయడం బట్టి చూస్తుంటే ఆమె ఎందుకో బయపడుతున్నట్టుగా ఉందని కథనాలు వస్తున్నాయి. వివేకా పీఏ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. వివేకాను తానే హత్య చేశానని నేరం ఒప్పుకున్న హంతకుడు దస్తగిరి దర్జాగా బయట తిరగడం ఏంటని.. పీఏ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆఖరికి అందులో కూడా సునీత రెడ్డి ఇంప్లీడ్ అయ్యారంటే.. అనుమానితులను ఆమె ఎంతలా కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారో అర్ధం చేస్కోవాలి. ఈ హత్యకు సునీతకు ఏదో సంబందం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు. చివరికి వివేకా కేసు రాజకీయంగా వివాదాస్పదమైపోయి చివరకు దర్యాప్తు మొత్తం కంపైపోయింది.