కోటంరెడ్డి సంచలన ప్రకటన…తేల్చుకుందాం రండి..!

ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉండగానే.. ఇటు అధికార పార్టీలోనూ, అటు ప్రతిపక్ష పార్టీలోనూ ఉన్న నాయకులు ఒక్కొక్కరిగా అసంతృప్తి తెలుపుతున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే నెల్లూరు రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఒక్క నెల్లూరు జిల్లాలోనే.. ఏకంగా ఇద్దరు నాయకులు పార్టీపై తిరుగుబాటు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి అధికార పార్టీపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. దానికి సంబందించిన ఓ ఆడియో కూడా కోటంరెడ్డి రిలీజ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి సంచలన విషయాలు వెల్లడించారు. నా ఫోన్ 100 % ట్యాప్ చేశారంటూ.. ప్రభుత్వ పెద్దల అనుమతితోనే ఈ వ్యవహారం జరిగింది అంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియా ముందు వెల్లడించారు.

ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పారని, ఆడియో కూడా పంపడం జరిగిందని.. ఆ ఆడియో వచ్చిన నెంబర్ ను కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి బహిర్గతం చేశారు. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుందో అని కూడా పేర్కొన్నారు. అంతేకాదు బాలినేని శ్రీనివాస్ కి కూడా ఛాలెంజ్ చేశారు. నేను నా స్నేహితుడు ఐ-ఫోన్ లో మాట్లాడిన సంభాషణ ఎలా బయటకు వచ్చింది. ట్యాపింగ్ జరిగింది కాబట్టే అంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి పేర్కొన్నారు. తనకు అవమానం జరిగిన చోట ఉండలేనని తేల్చి చెప్పారు.. ఎమ్మెల్యే కోటంరెడ్డి. వచ్చే ఎన్నికల్లో YCPనుంచి పోటీ చేయనని కోటంరెడ్డి ప్రకటించారు. ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని తేల్చాలని, ఈ విషయంలో ఎక్కడికైనా వెళ్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.