టీడీపీ రౌడీ ఇజం…నోరుజారిన చింతమనేని

కొరివితో తల గోక్కోవడం అంటే బహుశా ఇదేనేమో. వివాదాలకు కేరాఫ్‌ అడ్రెస్‌ అయిన చింతమనేని చేసిన వ్యాఖ్యలకు ఈ మాట కరెక్ట్ గా సెట్ అవుతుంది. ప్రశాంత౦గా ఉన్న రాజకీయాలలో మర్సారి మాటల చిచ్చు రగిల్చారు.. చింతమనేని. టీడీపీ గెలిచి అధికారంలోకి వస్తే.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను కూల్చేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చింతమనేని చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. అంతేకాదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత ఈ రౌడీ ప్రభుత్వానికి.. మా ప్రభుత్వంలో చుక్కలు చూపిస్తామని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

కూల్చివేతలంటే ఎలా ఉంటాయో చూపిస్తాం అంటూ వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఏ పార్టీతో పొత్తులు లేకపోయినా.. 160 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ గెలిచి, అధికారంలోకి వచ్చిన తర్వాత మా కూల్చివేతలు ఎలా ఉంటాయో చూపిస్తామంటూ చింతమనేని సంచలన వ్యాఖ్యలు చేశారు. చింతమనేని వ్యాఖ్యలకు వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.