వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. వైఎస్ వివేకా హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. వివేకా హత్యకు కారణం మహిళలతో ఉన్నటువంటి వివాహేతర సంబంధంమేనని సంచలన ఆరోపణలు చేసారు. A2గా ఉన్న సునీల్ యాదవ్ తల్లితో పాటు.. ఉమా శంకర్ రెడ్డి భార్యతో వివేకాకు వివాహేతర సంబంధం ఉందని.. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ లో సంచలన ఆరోపణలు వెల్లడించారు. అంతేకాదు.. రెండో భార్యకు వివేకా ఆర్ధికంగా అనుకూలంగా వ్యవహరించినందుకే.. సునీత కక్షకట్టి౦దని, రెండో భార్య కొడుక్కి హైదరాబాద్ లో ఓ విల్లా కొనుగోలు చేసేందుకు వివేకా ప్లాన్ కూడా చేశారని అవినాష్ సంచలన ఆరోపణలు పిటిషన్లో వెల్లడించారు. ఇదంతా పసిగట్టిన వివేకా కూతురు సునీత కక్ష కట్టి.. స్థానిక ఎమ్మెల్సీ ద్వారా ఏపీ ప్రతిపక్ష నేతతో కలిసి కుట్ర చేశారని అవినాష్ రెడ్డి పిటిషన్ లో వెల్లడించారు. ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే.. ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసి.. నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. విచారణకు ముందుగానే ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ లో కీలక అంశాలు హైకోర్టుకు సమర్పించారు.