బిటెక్ రవిని అంతమొందించే కుట్ర..! చంద్రబాబు సంచలనం

ఈ మధ్య చంద్రబాబు ఏది మాట్లాడినా సంచాలనంగానే ఉంటున్నాయా..? ఆయన మాటలు ఏపీ రాజకీయాలలో అలజడులు సృష్టించే విధంగా ఉంటున్నాయా..? ఆయన కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. మాజీ ఎమ్మెల్సీ బిటెక్ రవి ఎమ్మెల్సీ పదవి కాలం ముగియడంతో ఆయన భద్రత తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ ప్రత్యర్థుల నుండి రవికి ప్రాణహాని వుందని, సంఘ వ్యతిరేక శక్తుల బెదిరింపుల నేపథ్యంలో రవికి భద్రత కొనసాగించాలని రాష్ట్ర డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి చంద్రబాబు కోరారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో రవికి సంబంధాలున్నాయంటూ ప్రత్యర్థులు దుష్ఫ్రచారం చేయడమే కాక.. నిందితుడిగా చేర్చాలని కుట్రలు కూడా పన్నారని చంద్రబాబు అన్నారు. 2006లో రవి పెదనాన్న ఎం.రామచంద్రారెడ్డి, కజిన్ పి.రామచంద్రారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. దీంతో రవికి కూడా ప్రాణహాని పొంచివుండటంతో ఆనాటి ప్రభుత్వం 1+1 గన్ మెన్లతో సెక్యూరిటీ కల్పించింది. అంటే ఎమ్మెల్సీగా ఎన్నికవక ముందు నుండే రవికి సెక్యూరిటీ వుండేది. ఇక ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత బిటెక్ రవికి 2+2 భద్రత కల్పించారని అన్నారు. అయితే ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడాన్ని సాకుగా చూపి అతని భద్రతను తొలగించడం సరికాదన్నారు.