వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకొ ట్విస్టు.. ఈ కేసులో అప్రూవల్ గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి చేస్తున్న వ్యాఖ్యలు.. కేవలం ఆరోపణలేనా..? లేక అందులో వాస్తావాలు కూడా ఉన్నాయా..? అప్రూవల్ గా మారిన దస్తగిరికి నిజంగానే ఎంపీ అవినాశ్ రెడ్డి, సీఎం జగన్ వల్ల ప్రాణ హాని ఉందా..? అప్రూవల్ గా మారిన దస్తగిరికి అమాంతంగా ఇంతటి హోదా దక్కడానికి కారకులు ఎవరు..? వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా ఇందులో చంద్రబాబు హస్తం ఉందా..? ఈ కేసులో బీటెక్ రవి పాత్ర ఉందా..? మరి మొదట్లో వివేకా కూతురు సునీత.. తన తండ్రి హత్య కేసులో టిడిపి నేతలు ఉన్నారని ఎందుకు ఆరోపించారు..? వైఎస్ సునీత ఇంకేమైనా నిజాలు దాస్తున్నారా..? వివేకాకు ఉన్న రెండవ భార్య గురించి సునీతకి ముందే తెలుసా..? రెండవ భార్య కొడుక్కి ఆస్తి అంతా దారాదత్తం చేశారని సునీతనే ఈ హత్య చేయించారా..? సునీత భర్త రాజశేఖరరెడ్డి పాత్రపై విచారణ జరగాలని వైసీపీ ఎందుకు డిమాండ్ చేస్తోంది..? ఈ కేసులో ఎల్లో మీడియా కల్పితాలు ప్రచారం చేస్తోందా..? వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందా..? అసలు ఈ కేసులో సీబీఐ న్యాయపూర్వకంగానే వ్యవహరిస్తోందా..? సీబీఐ దర్యాప్తు తప్పుదోవ పడుతుందా..? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఈ కేసులో తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని.. ఎంపీ అవినాష్ రెడ్డి తేల్చి చెప్పారు.
ఒక్క దస్తగిరి మాత్రమే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కేవలం ఒక్క స్టేట్మెంట్ ను ఆధారంగా చేస్కొని.. అవినాష్ రెడ్డి నిందితుడు అని సీబీఐ ఎలా చెప్పగలదు అని పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. దస్తగిరి అప్రూవల్ గా మారడానికి ఎవరికో అమ్ముడు పోవచ్చు కదా..? అలా అమ్ముడుపోయి.. ఇప్పుడు రాజబోగాలు అనుభవిస్తున్నారని విశ్లేషకులు బహిరంగాణగానే అంటున్నారు. ఒకప్పుడు డ్రైవర్ గా ఉన్న
దస్తగిరి.. ఇప్పుడు ఆయనకు సఫారి కారు ఎక్కడ నుంచి వచ్చింది..? ప్రెస్ మీట్ పెట్టే స్థాయికి ఎదిగారు అంటే.. ఆయన నోట ఈ పలుకులు ఎవరు పాలికిస్తున్నారు అన్న దానిపై కూడా ప్రస్తుతం పలు రకాల చర్చలకు దారి తీస్తుంది. దస్తగిరి చేస్తున్న ఈ ఆరోపణల వెనుక ఎల్లో మీడియా దాగి ఉందని, ఈ దర్యాప్తు వెనుక చంద్రబాబు హస్తం ఉందని నిన్నటి వేల సజ్జల పలు రకాల వ్యాఖ్యలు చేశారు. అయితే.. దస్తగిరిని ప్రూవల్ గా మారడానికి చంద్రబాబే కారణమని ప్రచారం జరుగుతోంది. దస్తగిరికి కోట్లలో ముట్టజెప్పి.. మీడియా ద్వారా నిరాధార ఆరోపణలు చేయిస్తున్నారని కూడా ప్రచారం సాగుతోంది. చివరికి దస్తగిరిని కూడా చంద్రబాబు చంపిస్తారని టివి ఛానెల్స్ లో పలు రకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే.. ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐకి తెలంగాణ హైకోర్ట్ ఆదేశించింది. మరి 25న ఎలాంటి ట్విస్ట్ తెరపైకి వస్తుందో చూడాలి.