తెలంగాణ ప్రజలకు వైసీపీ నేతలు జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. పవన్ పై వైసీపీ నేతలు రియాక్ట్ అవుతూ ఓ రేంజ్ లో కౌంటర్లు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ది ఆంద్రప్రదేశ్ కాదా..? రాజకీయం కోసమే ఆంధ్ర ప్రదేశ్ కావాలా అని తాజాగా
పేర్ని నాని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళకి లొంగి పోయాడా అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ మంత్రి ఏపీని కించ పరిస్తే అది వేరే ఇది అని పవన్ అంటున్నారని..తెలంగాణ తరుపున వకాల్తా పుచ్చుకొని పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను ఏమి అనకపోయినా పవన్ తమ పై నిందలు వేస్తున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కి ఈ కొత్త బాధ ఏంటో అర్ధం కావడం లేదన్నారు. ఇంతకు ముందు చంద్రబాబు, లోకేష్ ని అంటే పవన్ వచ్చే వారని..ఇప్పుడు తెలంగాణ మంత్రులను ఏదైనా అంటే పవన్ కళ్యాణ్ వకాల్తా పుచుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కొత్త వకీల్ పాత్ర ఏంటో అర్ధం కావడం లేదన్నారు.. పేర్ని నాని. స్టీల్ ప్లాంట్‌ను అమ్మకుండా నేనే ఆపానని పవన్ అంటున్నారని, తన ట్వీట్ వల్లే ఆగిపోయిందని ఇంకొకాయన అంటున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. కేంద్రం మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని చెప్తే ఇప్పుడు ఎవరూ నోరెత్తడం లేదన్నారు. స్టీల్ ప్లాంట్‌పై ఢిల్లీ పెద్దలతో పవన్ ఎందుకు మాట్లాడటం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. బీజేపీ నాయకులంటే పవన్ కి ఎక్కడ లేని భయమని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ ఎలాంటి నీచానికైనా దిగజారుతారని.. వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ కి ఓ రేంజ్ లో కౌంటర్లు ఇచ్చారు.