రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్దమంటూ.. ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్న టిడిపికి షాకుల పరంపర కంటిన్యూ అవుతోంది. టిడిపిలో కార్యకర్తల మొదలు.. నాయకుల వరకు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. అంటే క్యాడర్ ను కాపాడుకోవడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారా..? లేదంటే.. గ్రూపు రాజకీయాలతో మిగతా నాయకులకు పార్టీలో ప్రాధాన్యత చేకూరడంలేదా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. స్వయంగా టిడిపి కి చెందిన నాయకులే ఒప్పుకుంటున్నారు. అయితే.. తాజాగా మరో 100 మంది టిడిపి నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అధిష్టానానికి షాక్ ఇచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకులు పార్టీలో చేరారు. వీరిని నియోజకవర్గ MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి, MLC డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం వైసీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కులం చూడం, మతం చూడం, ప్రతి ఒక్కరికీ తమ ప్రభుత్వం తమ సొంత వారిలా చూస్తూ.. ఆదరణ కల్పిస్తుంది అన్న విధానం నచ్చి, నేడు రాష్ట్ర ప్రజలకు సిఎం జగన్ చేస్తున్న మంచిని చూసి.. పార్టీ వైపు ఆకర్షితులమయ్యామని తాజాగా పార్టీలో చేరిన నాయకులు వెల్లడించారు. ఇకపై వైసీపీ కోసం పని చేస్తూ.. సిఎం జగన్ నినాదం వై నాట్ 175కి పూర్తి మద్దతు తెలుపుతామని టిడిపి నాయకులు చెప్పుకొచ్చారు.