పాపం చంద్రబాబు ఏం పాపం చేసకున్నారో ఏమో.. రోడ్ షో అంటూ ఆయన ఎప్పుడు రోడ్డెక్కినా జనాలు ఆగం ఆగం అవుతున్నారు.
గత 5 నెలల క్రితం కందుకూరు రోడ్ షోలో తొక్కిసలాట చోటుచేసుకొని 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత గుంటూరు సభలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నూజివీడు పర్యటనలో 9 మంది మహిళలకు విద్యుత్ షాక్ తగిలింది. వీరికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాబు సభలో జనం కన్పించేందుకు ఒక్కో మహిళకు 300 ఇస్తామని చెప్పి టీడీపీ నేతలు వీరిని తీసుకొచ్చారట. మహిళలు విద్యుత్ షాక్కు గురయ్యారని తెలిసి కూడా చంద్రబాబు వారిని పట్టించుకోకుండా వెళ్లిపోయారట. దీంతో డబ్బులు ఇస్తామని ఆశ చూపి తమను ఈ స్థితికి తెచ్చిన వారిపై ఆ మహిళలు మండిపడుతున్నారట.