చంద్రబాబుకి బిగ్ షాక్ చక్రం తిప్పిన జగన్ వైసీపీలోకి గల్లా జయదేవ్

ఆంధ్రా రాజకీయాలకు సెంటర్ ఆఫ్ ది పాయింట్ గా పేరొందింది ఏపీలో రెండే రెండు జిల్లాలు ఉన్నాయి. అవి ఒకటి విజయవాడ, రెండు గుంటూరు.
విజయవాడ రాజకీయాలు యమ హాటు అయితే.. గుంటూరు రాజకీయం మిర్చి కన్నా ఘాటు. అయితే.. ఈ రెండు ఎంపీ స్థానాలను టిడిపి కైవసం చేసుకుంది. వారిద్దరే ప్రస్తుతం చంద్రబాబుకి పెద్ద తలనొప్పిగా మారారని గత కొద్ది రోజుల నుంచి తెగ ప్రచారం జరుగుతోంది. రాజకీయాలలో గల్లా ఫ్యామిలికి ఎంతటి ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఎంపీ గల్లా జయదేవ్ గుంటూరు నుంచి ఎంపీ గా విజయం సాధించి.. ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు..? ఆయనకు ఏమైనా రాజకీయంగా ఒత్తుడులు ఎదురవుతున్నాయా..? లేదంటే.. పార్టీ మారబోతున్నారా..? ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు..? అసలు రాజకీయాలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్న తీరు దేనికి సంకేతం…? గత రెండేళ్ల నుంచి గల్లా జయదేవ్ వైసీపీలో జంప్ అవబోతున్నారంటూ.. వార్తలు తెగ హల్ చల్ చేశాయి. వాటికి ఆయన ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు.
మరి ఆయన చంద్రబాబుకి ఏమైనా ఫిట్టింగ్ పెట్టబోతున్నారా..? గత ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గాలి వీచినా.. గుంటూరు పార్లమెంట్ స్థానంలో పసుపు జెండానే ఎగిరింది. వచ్చే ఎన్నికల్లో గుంటూరు గడ్డపై ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేయాలని సిఎం జగన్ ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెట్టారని అంటున్నారు. అది గల్లా జయదేవ్ తో భర్తీ చేయాలని కూడా వైసీపీ అధిష్టానం యోచిస్తోందట. అవును.. మీరు విన్నది అక్షరాలా నిజం. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేదు. దాంతో.. ఆయన తన వ్యాపారాలపై ఫోకస్ పెట్టారు. ఆ సంధి మొదలు.. గల్లా జయదేవ్ పార్టీ కార్యకలాపాలలో అసలు పాలుపంచుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు ఆయన దూరంగానే ఉంటూ వచ్చారు. ఇప్పటి వరకు, వైసీపీ ప్రభుత్వాన్ని గానీ,, సిఎం జగన్ ని గానీ.. అంతెందుకు అసలు ఏపీలో జరుగుతున్న రాజకీయాలపై ఆయన ఒక్కసారి కూడా స్పందించిన సందర్బాలు సైతం లేవనే చెప్పాలి. వీటన్నీటినీ బేరీజు వేసుకొని.. ఆయన పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతుంది. గల్లా జయదేవ్ ప్రస్తుతం యాక్టివ్ గా లేనందున కన్నా లక్ష్మీనారాయణకు గుంటూరు ఎంపీ సీటుని ఆఫర్ ఇచ్చినట్లు.. టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గల్లా జయదేవ్ బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారనేది లోకల్ టాక్. ఆయన సమయం చూసుకొని వైసీపీలోకి రాబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. మరి ఆయన నిజంగానే వైసీపీలో వస్తే.. గుంటూరు రాజకీయాలు మరింత హాట్ హాట్ గా మారే అవకాశం కనిపిస్తోంది.