ఉండవల్లిలో హై టెన్షన్ టీడీపీ నేతలు అరెస్ట్

గుంటూరు జిల్లా ఉండవల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉండవల్లిలోని గ్రావెల్ క్వారీని టిడిపి నేతలు ముట్టడించారు. క్వారీలోని మట్టిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అమ్ముకుంటున్నారని క్వారీ వద్ధ టిడిపి నేతలు నానా హంగామా చేశారు. ఎమ్మెల్యే ఆర్కే అధికారంలోకి వచ్చిన నాటి నుండి.. కోట్లు విలువ చేసే మట్టిని అక్రమంగా తరలించారని ఆరోపణలు చేశారు. ఆ క్వారీ వద్దే టిడిపి శ్రేణులు టెంట్ వేసి ధర్నా చేపట్టారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో.. పోలీసు బలగాలు భారీగా చేరుకొని.. నిరసనకారులను బలవంతంగా లారీలోకి ఎక్కించారు పోలీసులు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.. టిడిపి శ్రేణులు. ఇంకోసారి ఈ ఉండవల్లి గ్రామానికి వస్తే చెప్పుతో బుద్ది చెప్తామని టిడిపి కార్యకర్తలు ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారు.