వివేకా కేసులో అంతిమంగా గెలిచేది న్యాయమే ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు

1.సచివాలయ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
రెండో విడత’ ఉద్యోగులకూ ప్రొబేషన్ ఖరారు చేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.

2.విజయవాడ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో ముస్లింలకు ఏపీ ప్రభుత్వం ఇవాళ ఇఫ్తార్ విందు..
హాజరైన సీఎం జగన్.

3. తెలంగాణ మంత్రులు ఏపీ రాష్ట్రాన్ని అవమానపరుస్తుంటే పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదు..
మంత్రి హరీష్ రావును పవన్ వెనుకేసుకొచ్చి మాట్లాడుతున్నారంటే ఎలా అర్ధం చేసుకోవాలని నిలదీసిన మంత్రి అప్పలరాజు.

4.టీడీపీకి ఓటేసే ఒక్క కుటుంబాన్ని వైసీపీ వైపు తిప్పినా చాలు.. మనకు వేలల్లో ఓట్లు..
వైసీపీకి ఓటేస్తామని చెప్పేవారితో దేవుడి ఫొటోపై ప్రమాణం చేయించుకోవాలన్న మంత్రి ధర్మాన

5.మాజీ ఎమ్మెల్సీ , టీడీపీ నేత బిటెక్ రవి కి షాక్..
ఎమ్మెల్సీ పదవి కాలం ముగియడంతో గన్ మెన్లను తొలగించిన ప్రభుత్వం.

6.బీటెక్ రవికి భద్రత తొలగించడంపై చంద్రబాబు అభ్యంతరం..
ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు.

7.”ఆలూరులో టీడీపీ గెలవకపోయినా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చిన్నచూపు చూడలేదు…
నగరడోన ప్రాజెక్టుకు భూసేకరణ కూడా చేశాం. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని లోకేష్ ఆరోపణ.

8.అంతిమంగా గెలిచేది న్యాయమే..:
వివేకా హత్య కేసులో అరెస్టులపై పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు.

9.వాలంటీర్లు దినపత్రిక కొనాలన్న జీవోలపై ఉషోదయ పిటిషన్…
కేసు విచారణ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం.

10.నేడు, రేపు కడప జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు..
35 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్ష.