ఎల్లో మీడియా, టీడీపీ కలిసి ఎలాంటి జిత్తులమారి ఎత్తులకు పన్నాగం పన్నుతారో అందరికీ తెలిసిందే. కన్నింగ్ కహానీలు, చేయని తప్పులను కూడా ఎత్తి చూపూతూ.. టిడిపి నాయకులు ఎలాంటి డ్రామా చేస్తారో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలిసిన విషయమై. తాడిచెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగినా కల్లు అంటారు.. అన్న సామెత ప్రకారం అసత్యాలు పలకడం టిడిపికి అలవాటుగా మారిపోయింది. అయితే.. ఈ నెల 4వ తేదీన సిఎం జగన్ కాలికి గాయం అయ్యింది. ఆయన ఇంట్లో జిమ్ చేస్తుండగా కాలు బెణికింది. దాంతో ఒంటిమిట్ట పర్యటన రద్దు అయ్యింది. దీనిని కూడా టిడిపి నానా రాద్దాంతం చేసింది. హిందూ దేవుళ్ల విషయంలో ప్రతిసారీ ఇలానే జరుగుతోందని టిడిపి అనడం, దానికి ఇంకాస్త మసాలా యాడ్ చేసి యల్లో మీడియా ప్రచారం చేయడం.. ఇలా సిఎం జగన్ పై పడి ఏడ్చడమే తప్ప మరే పని పాట లేదు. ఒంటిమిట్ట పర్యటన అంటే.. ఏదో తూతూ మంత్రంగా ఉండదు, మెట్లు ఎక్కాలి, కూర్చొని పూజలు చేయాలి.. అన్ని ఉన్నప్పుడు.. కాలికి గాయంతో ఎలా వస్తారు. చంద్రబాబుకి కొద్దిగా వేడి చేస్తేనే అస్సలు ఇంట్లో నుంచి బయటకే రారు. జగన్ ఒంగోని కూడా కొబ్బరి కాయ కొట్టలేడు అంటారు. బాగా చూడండి ఆయన కొబ్బరికాయ కొట్టిన విధానం. నిన్నటి శ్రీకాకుళం పర్యటనకు కూడా కాలికి గాయం తగ్గకుండానే వచ్చారు సిఎం జగన్. ఆ కాలుకి ఉన్న కట్టును చేస్తే అర్ధం అవుతుంది. నొప్పితో బాధ పడుతూనే రాష్ట్ర అభివృద్దికై ఇంతలా పరితపిస్తున్నావా జగనన్న, కాలు జాగర్త అన్న.. అంటూ ఆయన అభిమానులు కన్నీరు పెడుతున్నారు.