చరిత్ర సృష్టించిన జగన్ పార్టీ త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ అధికారులకు సీఎం ఆదేశం

1.ఆదాయాన్ని ఆర్జించే శాఖలపై సీఎం జగన్ సమగ్ర సమీక్ష..
శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలని అధికారులకు ఆదేశం.

2.ప్రజలే స్వయంగా దస్తావేజులు తయారు చేసుకుని సులభతరంగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం ఆవిష్కరణ..
రిజిస్ట్రేషన్ శాఖలో ఇ-స్టాంపింగ్ సేవలను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన సిఎం జగన్.

3.నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త..
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి.

4. సుప్రీంకోర్టులో అవినాష్రెడ్డికి ఊరట..
ఈ నెల 24 వరకు అవినాష్రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశ౦.

5. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి విశేష స్పందన..
14 రోజుల్లో కోటికి పైగా కుటుంబాల్లో సర్వే నిర్వహించి చరిత్ర సృష్టించిన వైఎస్సార్ కాంగ్రెస్.

6.ఎల్లో మీడియాను చూసుకుని బలుపుతో ప్రవర్తిసున్నారు.. తండ్రీకొడుకులు తిరుగుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు..
చంద్రబాబు చాలా ఫ్రస్టేషన్లో ఉన్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా.

7.వివేకా హత్య కేసులో సీబీఐ విచారిస్తున్నది, ఇప్పటివరకు అదుపులోకి తీసుకుంది చిన్న చేపలనే..
అసలైన కిల్లర్ ఫిష్ లు ఇంకా సీబీఐ వలకు చిక్కలేదని బొండా ఉమ విమర్శ.

8.1000 కిమీ మైలురాయి చేరుకున్న నారా లోకేశ్ పాదయాత్ర..
తన వెన్నంటి నిలిచిన వివిధ కమిటీలు, వాలంటీర్లకు లోకేశ్ అభినందనలు..

9.నేను టీడీపీ గుర్తుతోనే గెలిచాను.. మరి చింతమనేని ఎందుకు ఓడిపోయాడు?..
ముందు ఆయన నియోజకవర్గ పరిస్థితిని చూసుకోవాలని చింతమనేనికి వల్లభనేని వంశీ కౌంటర్.

10.గాడ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ..
సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు