వచ్చే ఎన్నికల్లో గన్నవరం ఎవరి అడ్డా కాబోతుంది..? గన్నవరంలో వల్లభనేని వంశీని ఓడించడం టిడిపి వల్ల అవుతోందా..? వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో పసుపు జెండా ఎగురుతుందా..? లేక కూలుతుందా..? వల్లభనేని వంశీకి టీడీపీ నుంచి ధీటైన అభ్యర్ధి ఎవరు..? గన్నవరంలో టిడిపి ని గెలిపించుకునేందుకు.. ఎంతటి ఖర్చుకైనా వెనకాడబోదా..? అంటే అవుననే అంటున్నారు టిడిపి నాయకులు. 50 కాదు 60 కాదు.. ఏకంగా 150 కోట్ల ఖర్చుకు రెడీ అయ్యిందని ప్రచారం సాగుతోంది. గన్నవరంలో 150 కోట్లు ఖర్చు పెడతానని ఓ వ్యక్తి తన వద్దకు వచ్చారని చింతమనేని పార్టీ కార్యకర్తల సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే డబ్బున్నవాడిని కాదు దమ్మునోడిని నిలుపుతామని చింతమనేని ప్రభాకర్ వెల్లడించారు. మీరు మీసం మేలేసేలా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటుందని చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జీగా ఉన్న బచ్చుల అర్జునుడు అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. దీంతో ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త ఇంచార్జీ కోసం టీడీపీ నాయకత్వం అన్వేషణ ప్రారంభించింది. కానీ ఆ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇంచార్జ్ లేరు. పార్టీ కార్యక్రమాలు కూడా స్టాప్ అయ్యాయి. చంద్రబాబు, నారా లోకేష్ పై వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సందరహాలు ఉన్నాయి. అంతేకాదు.. చంద్రబాబుకు వంశీ సవాల్ కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తానే గెలుస్తానని.. దమ్ముంటే తన గెలుపును ఆపమని ఛాలెంజ్ చేశారు. అక్కడి ప్రజలు కూడా వల్లభనేని వంశీకే మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన చేస్తున్న మంచికి తామంతా వంశీ వెంటే ఉంటామని గన్నవరం ప్రజలు తేల్చి చెప్పారు. గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఓడించడం ఎవరి తరం కాదని తమ అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.