రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే లోకేష్ కు షాక్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే శ్రీదేవిపై లోకేష్ భూకబ్జా ఆరోపణలు

1.భాస్కర్‌రెడ్డి అరెస్ట్ తర్వాత ఉత్కంఠ భరితంగా వైఎస్ వివేకా హత్య కేసు..
నేడు మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్న ఎంపీ అవినాష్ రెడ్డి.

2.కోడి కత్తి తగిలి ఇద్దరు చనిపోయారని మీ ఈనాడు పత్రికే రాసింది కదా? ..
వైఎస్ జగనైపై హత్యాయత్నం జరిగితే.. కోడి కత్తి కేసు అని చంద్రబాబు, ఎల్లో మీడియా ఎగతాళి చేశాయని మండిపడ్డ కన్నబాబు.

3. తమకు ఇక భవిష్యత్ ఉండదని భయపడుతున్నారు.. అందుకే బరితెగించి ఈనాడులో తప్పుడు రాతలు రాస్తున్నారు..
చంద్రబాబు సహకారంతో రామోజీరావు శంషాబాద్లో 450 ఎకరాలు కొన్నారని రామోజీ తోడల్లుడు అప్పారావు సంచలన ఆరోపణలు.

4. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి వైసీపీ మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదు..
విమర్శించాలనుకుంటే ఒక వ్యక్తిని విమర్శించాలే కానీ… ప్రజలను విమర్శించడమేమిటని ప్రశ్నించిన పవన్.

5. లోకేష్ పాదయాత్రకు షాక్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు..
ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మ ఫొటోతో ఉన్న ఫ్లెక్సీలను కట్టే ప్రస్తకేలేదని తేల్చి చెప్పిన అసమ్మతి నేతలు.

6.దళితులంటే చిన్నచూపుతో మాట్లాడుతున్న చంద్రబాబు, లోకేశ్ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి..
గతంలో చంద్రబాబు దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అవమాన పరిచారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ఫైర్.

7.వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిపై లోకేశ్ భూకబ్జా ఆరోపణలు..
ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్టిన లోకేష్.

8.పులివెందుల నుంచి భారీగా అనుచరులతో హైదరాబాద్ బయలుదేరిన అవినాష్ రెడ్డి
మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సీబీఐ ఆదేశం!

9.ఇన్నాళ్లూ ప్రతిపక్ష నేతల గొంతు నొక్కిన జగన్‌ సర్కార్‌.. ఇప్పుడు న్యాయవాదుల నోరు నొక్కుతోంది..
మార్గదర్శి వ్యవహారంపై మాట్లాడిన న్యాయవాదులకు సీఐడీ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని మండిపడ్డ అచ్చెన్నాయుడు.

10.వివేకా కేసులో మరో 48 గంటల వ్యవధిలో ఇంకో కీలక అరెస్టు ఉండే అవకాశాలు లేకపోలేదు..
భాస్కర్‌ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న అనంతరం రఘురామకృష్ణ సంచలన వ్యాఖ్యలు.