వివేకాను హత్య చేసిన దస్తగిరికి టీడీపీ నుంచి ఎంపీ టికెట్

రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికి 5గురు అరెస్ట్ అయ్యారు. అయితే.. వివేకా రెండో భార్య తెరపైకి రావడం, ఆమె cbiకి ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి బయటకు రావడంతో వివేకా కేసులో కీలక మలుపులు తిరిగతున్నాయి. ఈ కేసులో A4 నిందితుడుగా ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారి బెయిల్ పై బయట తిరుగుతున్నాడు. రెండ్రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి.. ఎంపీ అవినాష్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. వివేకాను హత్య చేసింది తానేనని బహిరంగంగా చెప్తున్న దస్తగిరి జైలులో ఉండకుండా బయట తిరగటం ఏంటని పలు రకాల ప్రశ్నలు వస్తున్నాయి. అంతేకాదు సిఎం జగన్, అవినాష్ ల వల్ల తనకు ప్రమాదం పొంచి ఉందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు దస్తగిరి. దీంతో పోలీసులు దస్తగిరికి భద్రత కల్పించారు. గతంలో వివేకా కార్ డ్రైవర్ గా ఉన్న దస్తగిరి.. ఇప్పుడు కార్ కొనుక్కొని ఓ డ్రైవర్ ని కూడా మాయింటెన్ చేస్తున్నారంటే.. పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దస్తగిరి అప్రూవర్ గా మారడం వెనుక ఎవరిదో బలమైన హస్తం దాగి ఉందని చర్చలు వస్తున్నాయి. ఇదనులో చంద్రబాబు పాత్ర ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే.. దీనిపై స్పందించిన రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు దస్తగిరికి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అంతేకాదు.. దస్తగిరికి ఎంపీ టికెట్ ఇస్తే.. సునీత ప్రచారం చేస్తారని రాంగోపాల్ వర్మ ట్విటర్ లో ట్వీట్ చేశారు. అంటే వివేకా హత్య కేసుకు చంద్రబాబుకు సంబంధం ఉందని వర్మ చెప్పకనే చెప్తున్నారా..? ఈ కేసుకు సునీతకు ఏమైనా సంభంధం ఉందా..? రాంగోపాల్ వర్మ ట్వీట్ అనంతరం ఇలాంటి వార్తలే తెగ హల్ చల్ చేస్తున్నాయి.