1. సీఎం జగన్ పై దాడి ఘటనలో తప్పుడు వార్తలు రాస్తున్నారు. అయితే.. అలిపిరి ఘటన కూడా డ్రామానా చంద్రబాబు?
డీఎల్ రవీంద్రరెడ్డి లాంటి నీచ వ్యక్తులతో మాట్లాడించి టీవీలో వేస్తున్నారని పేర్ని నాని ఫైర్.
2. విశాఖ ఎయిర్పోర్టులో జగన్పై హత్యాహత్నం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలి..
ఎస్ఐఏ రిపోర్టు ఏంటి? ఎల్లో మీడియా అసత్య రాతలేంటి అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం.
3.టీడీపీ, జనసేన వాళ్లు దొంగతనంగా వెళ్లి పోటీగా స్టిక్కర్లు అంటిస్తున్నారు..
పది ఇళ్లకు ఇలా చేసి తమ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి రోజా ఫైర్.
4.జగనన్నే మా భవిష్యత్తు.. ఇది చారిత్రాత్మక ప్రజా మద్దతు..
వారం రోజుల్లో 63 లక్షల కుటుంబాల సర్వే చేయగా.. సీఎంకు మద్దతుగా 47 లక్షల మిస్డ్ కాల్స్ వచ్చాయని మంత్రి జోగి రమేష్ వెల్లడి.
5.నారా లోకేష్ పాదయాత్రకు నిరసన సెగ..
ఆయనను అడ్డుకున్న దళిత సంఘాలు.. దళితులు ఏం పీకారంటూ అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్.
6.స్టీల్ ప్లాంట్ కోసం ప్రైవేటు సంస్థ తరఫున బిడ్ వేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
క్రౌడ్ ఫండింగ్ ద్వారా మూలధనం సేకరిస్తామని వెల్లడి.
7.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం చేస్తున్నారు..
కూల్చేవారికి కట్టడం ఎలా తెలుస్తుంది? విధ్వంసకారులకు విధానం ఏముంటుంది? అంటూ చంద్రబాబు ట్వీట్.
8.జనసేన పార్టీలో ఉన్న చిన్న చిన్న విభేదాలను పరిష్కరించుకుంటాం..
ఇప్పుడు తనపై మరింత బాధ్యత పెరిగిందని పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు వెల్లడి
9.‘ఆపరేషన్ దుర్యోధన’ సినిమాలా.. కోడికత్తితో భుజంపై గీతలు పెట్టించుకొని జగన్ డ్రామాలు..
4 ఏళ్లుగా ప్రజల్ని వేధిస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు మండిపాటు.
10.ఫేక్ టీడీపీ నాయకుల్ని సృష్టించి, వారితో ఫేక్ వీడియోలతో ఫేక్ ప్రచారం చేయిస్తున్నారు..
మరలా జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి సజ్జల భార్గవ్ రెడ్డి పాకులాడుతున్నారని వర్ల రామయ్య ఆగ్రహం