1. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన..
ఈ కార్యక్రమాన్ని ఈ నెల 29 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం.
2. సెప్టెంబర్ నుంచి విశాఖలో పాలన సాగిస్తాం..
శ్రీకాకుళం జిల్లా మూలపేట సభలో సీఎం జగన్ కీలక ప్రకటన..
3.మూలపేట పోర్టు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 వేల మంది స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి..
పోర్టు అనుబంధ సంస్థలు కూడా వస్తే మున్ముందు లక్షల సంఖ్యలో స్థానికంగానే యువతకు ఉపాధి లభిస్తుందని సిఎం జగన్ స్పష్టం.
4.అవినాష్ అనుచరులు నన్ను అనుసరిస్తున్నారు.. తగిన రక్షణ కల్పించండి..
కడప ఎస్పీ ఆఫీసులో దస్తగిరి ఫిర్యాదు
5.సొంత బాబాయ్ హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని అధికారంలోకి వచ్చారు..
జగన్ ఆండ్ కో నటన ఆస్కార్ స్థాయిలో వుందని టిడిపి ఎమ్మెల్సీ అనురాధ ఎద్దేవా.
6.స్టీల్ ప్లాంట్ విషయంలో కేఏ పాల్ ను కలిసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్న జేడీ.
7.ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణకు మరోసారి నోటీసులు..
వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం.
8.కోడికత్తి, బాబాయ్ హత్య అని చెప్పి మేము ఎన్నికల్లో గెలిచాం..
డబ్బులు లేకపోవడం వల్లే మొన్న జగన్ బటన్ నొక్కలేదు, బాలినేనితో నొక్కించారని రఘురామకృష్ణరాజు సెటైర్లు.
9.విశాఖలో వైఎస్ భారతి భూదందాలు… జగన్ కాపురం మార్పు అందుకోసమే..
సీఎం సతీమణి కనుసన్నల్లోనే విశాఖలో భూదందాలు జరుగుతున్నాయని టిడిపి నేత బండారు సత్యనారాయణమూర్తి ఆరోపణ.
10.అబ్దుల్ కలాం పేరు తీసేసి వైఎస్సార్ వ్యూ పాయింట్ అని పేరు పెట్టడం బాధకరం..
వైజాగ్‌లోని కలాం వ్యూపాయింట్ పేరు మార్పుపై సిఎం జగన్ పై చంద్రబాబు ఫైర్..