పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి. అసలు పవన్ కళ్యాణ్ పొలిటికల్ అజెండా ఏంటి..? ఆయన చేస్తున్న రాజకీయాలలకు, ఆయన మాట్లాడుతున్న మాటలకు ఒకటికొకటి అస్సలు పొంతన లేకుండా పోయాయా.? ఎవర్నో ప్రశ్నిస్తానని చెప్పి పార్టీ పెట్టి.. ఇప్పుడు ఏపీలో లేకుండా ఇంకెవరికో వత్తాసు పలుకుతున్నారా..? పవన్ కళ్యాణ్ రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా..? కుల రాజకీయాలు చేయనని చెప్పి.. నా కాపులు నాకు ఓటేసి ఉంటే.. నేను గెలిచి ఉండేవాడిని అని చెప్పడం.. కుల రాజకీయాలు కాదంటారా..? ఒకానొక సమయంలో ఏమన్నావ్ పవన్.. ప్యాకేజీ స్టార్ అంటే వైసీపీ నాయకులని చెప్పు తీసుకొని కోడతా అంటూ.. ఒక పార్టీ అధినేత మాట్లాడకూడని మాటలు, రాజకీయ నాయకుడు వాడకూడని పదాలు వాడతావా..? అసలు ఏపీ మంత్రులు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఏమన్నారని అంతలా గింజుకుంటున్నావ్..? ఎవరో ఏపీ గురించి మాట్లాడితే.. ఆ మాట్లాడిన వ్యక్తి పేరు పెట్టి డైరెక్ట్ గానే వైసీపీ మంత్రులు కౌంటర్ తో క్లారిటీ ఇచ్చారు.. దానికి తమరు వేరేలా మార్చి.. తెలంగాణ ప్రజలను ఏదో అన్నారని.. వైసీపీ నాయకులు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఏదేదో అంటున్నావు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు.. ఎప్పుడో జరిగిపోయిన ముచ్చట నేడు ప్రస్తావించి.. రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసేది ఎవరు..? నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అన్యాయంగా విడగొడితే.. ఎక్కడకి పోయింది మీ ప్రశ్నించేతత్వం..? నాడు ఏపీ ప్రజలను ఉద్దేశించి కేఎసీఆర్ వ్యాఖ్యలు చేస్తే.. ఎక్కడకి పోయింది మీ ప్రశ్నించేతత్వం..? మీరు కాదా ఇప్పుడు వన్ సైడ్ రాజకీయాలు చేస్తూ.. రాజకీయాలంటే ప్రజలకు నమ్మకం, నిజాయితీ పోగెట్టేలా చేసేది..? ప్యాకేజీ స్టార్ అన్న పేరు తెచ్చుకొని విలువలు లేని రాజకీయాలు చేసేది మీరు కాదా పవన్ కళ్యాణ్. అంటూ.. వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కి వెయ్యి ప్యాకేజ్ అంటూ తాజాగా ఓ వార్తా పత్రికలో ప్రచురితం అయితే.. దానిపై ఎందుకు స్పందించలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు నిలదీస్తున్నారు. మరి దీనికి పవన్ కళ్యాణ్ ఏమని సమాధానం చెప్తారు..? పవన్ కళ్యాణ్ ప్యాకేజీకి తప్పితే.. విలువలతో కూడన రాజకీయాలు చేసే ఉద్దేశ్యం లేదని పబ్లిక్ బహిరంగంగానే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఒక వ్యాపార సంస్థగా వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. వారానికో, పదిరోజులకోసారి రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టి పోవడం పరిపాటిగా మారిందని ఆరోపిస్తున్నారు. ఇక్కడి ప్రజలు ప్రజలుగా కనిపించడం లేదా అని పవన్‌ను ప్రశ్నించారు. ఏపీ మంత్రులనుద్దేశించిన చెప్పిన మాటలను వెనక్కి తీసుకొని ఏపీ ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.