బోగస్ రాతలు, అసత్య ప్రచారాలు, అసత్య ఆరోపణలు.. వండివార్చడంలో ఎల్లో మీడియాకి, దుష్ట చతుష్టయానికే సాధ్యం. దుష్ట చతుష్టయం అంటే ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. ఇంకా మీకు అర్ధమయ్యేలా చెప్పాలంటే.. మీరెప్పుడైనా దండుపాళ్యం బ్యాచ్ చూశారా..? ఆ బ్యాచ్ చేసే ఆలోచనలు, ఆరాచకాలు ఎలా ఉంటాయో తెలుసుగా. వారు న్యాయ౦-అన్యాయాలు చూడరు.. వేటు వేశామా, ఎదుటివాడిని మట్టు బెట్టామా.. అన్నదే చూస్తారు. ఇంకా చెప్పాలంటే.. వారి ఆనందం కోసం ఎదుటివారి నెత్తురు తాగేందుకు కూడా వెనకాడరు. దుష్ట చతుష్టయం కూడా ఇంతేనండి..
వారు చెప్పేదే వేదం, వారు చేసేదే న్యాయం అన్న విధంగా ఫీల్ అవుతారు.
సిఎం జగన్ ఏదో అన్నారని కాదుగానీ.. అసలు మీడియా చెప్పాల్సింది, రాయాల్సింది.. ప్రజలకు చేరవేయాల్సింది వార్తలు, అందులో ఉన్న నిజాలు మాత్రమే. కానీ ఈ ఎల్లో మీడియా చెప్పేది ఏంటి..? రాసేది ఏంటి..? చూపించేది ఏంటి..? విలువలు మరిచి.. ఎవరికో కొమ్ము కాస్తూ.. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా.. అధికార పక్షంపై ఆరోపణలు గుప్పిస్తూ.. మసిపూసి మారేడుకాయ చేస్తూ.. చంద్రబాబుకి జాకీలు వేస్తూ జనం చేత తిట్లు తినే స్థితికి దిగజారుతోంది… ఈ ఎల్లో మీడియా. అసలు విషయం ఏంటంటే.. ఒకసారి స్క్రీన్ పై చూస్తే మీకే అర్ధం అవుతుంది.. ఎల్లో మీడియా ఎంతటి నీచానికి దిగజారిందో అనేది. ఆంధ్రజ్యోతి పేపర్ లో తల్లిని మరిచారు అంటూ వార్త ప్రచురితం అయ్యింది. తల్లిని, చెల్లిని దూరం పెట్టారు.. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే ప్రాదాన్యత అంటూ.. ఇలాంటి ఒక వార్తని ఒక బ్యానర్ గా అచ్చు వేసి ప్రచురితం చేస్తున్నావు.. ఇంతకంటే దిగజారుడుతనం ఇంకేమైనా ఉందా రాధాకృష్ణ..? నువ్వు నీ tissue పేపర్ దిగజారారు అనేది చాలా చిన్న మాట. tissue పేపర్ అయినా తుడుచుకోవడానికి యూస్ అవుతుంది.. కానీ నీ పేపర్ అందుకు కూడా ఉపయోగ పడదని బయట జనం ఉమ్మేస్తున్నారు. ఇలాంటి చెండాలపు వార్తలు రాసి.. ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నావు..? ఇలాంటి నీతి – నిజాయితీ లేని వార్తలు రాస్తూ ఇంకెంత కాలం పబ్బం గడుపుతావు..? మీరు చూపించే అవాస్తవాలకు ఆల్రెడీ ప్రజలు చరమగీతం పాడేస్తున్నారు. మీరు ఇంతకాలం ఇంతటి నీచానికి పాల్పడ్డారు కాబట్టే.. మీ భార్యను కోల్పోయావు.. ఇలా పాపాలు చేస్తూ ఇంకెంతమందిని కోల్పోతావో అది నువ్వే గమనించుకోవాలి. నీలో మార్పు రాకపోతే.. చివరికి పురుగుపట్టి పోతావ్ రాధాకృష్ణ. నీ బాస్ ఒక వెన్నుపోటు దారుడు. చంద్రబాబు ఎప్పుడైనా వాళ్ళ అమ్మని, నాన్నని తలచుకున్నాడా..? అసలు చంద్రబాబు అమ్మ, నాన్నల కోసం ఏమైనా చేశాడా… చెప్పు రాధాకృష్ణ.
రాజకీయాలు ఒక ఎత్తు అయితే నీ దిగజారుడు ఇంకొక ఎత్తు.. రాధాకృష్ణ. నీ బ్రతుకు ఒక మనిషి బ్రతుకేనా.. పశువులతో పోల్చి వాటిని అవమాన పరచడం కంటే ఇంకొక మాటే లేదనే చెప్పాలి. ఏది రాస్తే అది నమ్మేయడానికి జనం ఏమైనా ఎర్రి గొర్రెలు అనుకున్నావా..? నువ్వు , చంద్రబాబు కలిసి అవాస్తవాలను చూపిస్తూ మళ్ళీ రాజ్యాన్ని ఏలేద్దామనుకుంటే పోరాబాటే abn రాధాకృష్ణ. ఎందుకంటే.. నెక్స్ట్ ఎన్నికల్లో బాబు గెలిచే దాఖలాలు ఏ కోశానా కనబడట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా జనం జగన్ కే జై కొడుతున్నారు. తల్లిని, చెల్లిని దూరం పెట్టారని అంటున్నావే..రాష్ట్ర మహిళలకు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని మంచిని కేవలం సిఎం జగన్ మాత్రమే చేస్తున్నారు. నేటి మహిళలు సంతోషంగా ఉన్నారు అంటే.. అది కేవలం జగన్ చూపించే ప్రేమే అని చెప్పాలి. నాడు డ్వాక్రా మహిళలకు ఋణమాఫీ అంటూ.. ప్రగల్బాలు పలికి ఆ హామీని గాలికి వదిలేసిన చంద్రబాబుపై ఎందుకు కధనం రాయలేదు. రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు కాదు రాధాకృష్ణ.. అందరూ అన్నీ గమనిస్తున్నారు.