రాప్తాడు ఎమ్మెల్యే దెబ్బకి పరిటాల ఫ్యామిలీకి కోలుకోలేని దెబ్బ సర్వేతో బాబుకు వణుకు

అనంతపురం జిల్లాలో హాట్ సీట్ ఏదైనా ఉందంటే.. అది రాప్తాడు నియోజకవర్గం అని చెప్పాలి. రాప్తాడులో రాజకీయ౦ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ ఎరుకే. ఒకప్పుడు రాప్తాడు టీడీపీకి కంచుకోట. కానీ.. గత ఎన్నికల్లో వీచిన వైసీపీ వేవ్‌లో ఆ కంచుకోటకు బీటలు వారాయి. రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విజయంతో.. పరిటాల ఫ్యామిలీకి వెన్నులో వణుకు మొదలయ్యిందనే చెప్పాలి. గతంలో రాప్తాడు నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. మనోధైర్యంతో ముందుకు సాగి మూడోసారి ముచ్చటగా పోటీ చేసి..
25,575 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అప్పటి నుంచి రాప్తాడు రాజకీయంలో రణం మొదలయ్యింది. ప్రస్తుతం రాప్తాడులో రాజకీయాలు సై అంటే సై అన్న రేంజ్ లో ఉన్నాయి. ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం.. ప్రతిపక్షాలతో
పోరాటాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. తెగించి పోరాడితే బానిస సంకెళ్ళు బద్దలు కావడంతప్ప పోయేది ఏముండదు.. అన్న సిద్దాంతాన్ని నమ్మి.. ప్రతిపక్షాల బరతం పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడులో మళ్ళీ ఎగిరేది వైసీపీ జెండానే అంటూ.. పరిటాల కుటుంబం గెలిస్తే.. మీసం గొరిగిచ్చుకుంటా అంటూ.. మీసం దువ్వి మరీ సవాల్ చేశారు.. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. వ్యూహాలకు పదును పెట్టి.. పరిటాల ఫ్యామిలీకి కోలుకోలేని దెబ్బ కొట్టే రాజకీయాలు చేస్తున్నారు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. అంతెందుకు రాప్తాడు గానీ, ధర్మవరంలో గానీ పోటీ చేస్తే గెలుస్తామా అన్న డైలమాలో పరిటాల ఫ్యామిలీ ఉంది. ప్రస్తుతం తమ క్యాడర్ కూడా తమ వెంట లేదని లోకల్ టాక్. రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరింత పట్టు సాధిస్తున్నారా..? ఆ చేస్తున్న మంచి పనుల వల్లే వైసీపీ క్రేజ్ అమాంతం పెరిగిందా..? అంటే అవుననే అంటున్నారు అక్కడి ప్రజలు.

తాజాగా రాప్తాడులో క్లాక్ టవర్ వద్ద జరిగిన రచ్చతో ఏపీలోనే రాప్తాడు హాట్ టాపిక్ గా మారింది. రాప్తాడు అభివృద్దిపై టిడిపి చేసిన సవాల్ కాస్త రచ్చ రచ్చ అయ్యింది. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కబ్జాలకు పాల్పడ్డారని, కోట్లలో కుంభకోణం చేశారని పరిటాల శ్రీరామ్ సోషల్ మీడియాలో సవాల్ చేశారు.
ఆ సవాల్ కి సీరియస్ గా రియాక్ట్ అయిన వైసీపీ.. పరిటాల ఫ్యామిలీ చేసిన అక్రమాలు, భూదోపిడీలను ఒక్కొక్కటిగా బయటపెట్టారు.. తోపుదుర్తి.
పరిటాల రవీంద్ర రాజకీయాల్లోకి వచ్చిన తరువాతే ఆస్తులు పెరిగాయని, వాటిని పరిటాల శ్రీరామ్ అధికారంలో ఉన్నప్పుడు మరింత కూడగట్టుకున్నారని తోపుదుర్తి సంచలన నిజాలు బయటపెట్టారు. రాప్తాడు అభివృద్ధి జరిగినది అంటే.. అది కేవలం తమ ప్రభుత్వంలోనే అంటూ..
ఎమ్మెల్యే తోపుదుర్తి బల్లగుద్ది మరీ చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో సంతోషంగా ఉన్న జనమంతా ఆయన వెంటే నడుస్తున్నారు. ఉనికి చాటుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న చీప్ ట్రిక్స్ ని ఎప్పటికప్పుడు కనిపెడుతూ.. రాప్తాడు నియోజకవర్గ అభివృద్దికి పాటుపడుతున్నారు.. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. రాప్తాడులో జగనన్న కాలనీలను అభివృద్ది చేసి.. వాటి నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తూ.. జనం గుండెల్లో ఒక పధిలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. నియోజకవర్గంలో రైతులకు ఆరువేల బోర్లను ఉచితంగా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించి.. రైతన్నల కంట వెలుగులు పుయిస్తున్నారు. కొన్ని వేల కుటుంబాలకు శాశ్వతంగా ఉపాధి కల్పించే కొన్ని మహత్తరమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మరి ప్రజల కోసం ఇంత కష్టపడుతున్న రాప్తాడు ఎమ్మెల్యేకి రానున్న ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ పట్టం కడతారని పలు సర్వేలు కూడా తేల్చి చెప్పాయి.