వివేకా హత్య వెనుక చంద్రబాబు సీబీఐకి షేక్ షమీమ్ స్టేట్మెంట్

వివేకా హత్య జరిగినప్పుడు టీడీపీ అధికారంలో ఉందని, మూడు నెలలు వాళ్ళు విచారణ చేశారని.. ఆనాడు ఎందుకు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పేర్లు రాలేదని వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలూ ఈ హత్య వెనుక చంద్రబాబు మెయిన్ పాత్ర ఉన్నట్లు అనుమాన వ్యక్తం చేస్తున్నామని మంత్రి కారుమూరి విమర్శలు గుప్పించారు. తక్షణమే చంద్రబాబును సీబీఐ విచారించాలని కోరారు. పుట్టినరోజు నాడు కూడా చంద్రబాబు 420 మాటలు మానలేదని ఎద్దేవా చేశారు. మాయ మాటలతో ప్రజల్ని మోసం చెయ్యడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. జగన్ పై ఏదో రకంగా బురదజల్లాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు.

వరో వైపు వివేకా రెండో భార్య షేక్ షమీమ్ CBIకి ఇచ్చిన స్టేట్మెంట్ తో మరికొన్ని నిజాలు బట్టబయలయ్యాయి. ఇప్పుడు వివేకా రెండో భార్య షేక్ షమీమ్ ఇచ్చిన స్టేట్మెంట్ తో కీసు కీలక మలుపు తిరిగే ఛాన్స్ ఉంది. ఆస్తి తగాదాలే వివేకా హత్యకు.. కారణమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకా చనిపోవడానికి గంట ముందు తనతో మాట్లాడారని, బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్లో 8 కోట్లు వస్తుందని.. అది తన కొడుకు పేరు మీద భూమి కొంటానని చెప్పారని షమీమ్ కొన్నినిజాలు బయట పెట్టారు. అంతేకాదు.. తన కొడుకు షహన్షా పేరు మీద 4 ఏకరాల భూమి కొందామని వివేకా అనుకున్నారు.. కానీ శివ ప్రకాష్ రెడ్డి ఆపేశాడని షేక్ షమీమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఈ కేసు అటుఇరిగి.. ఇటు తిరిగి సునీత దంపతులకు మరింత ఉచ్చు బిగుసుకుంకుంటుంది. మరోవైపు షేక్ షమీమ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. తన పేరిట, తన కొడుకు పేరిట వివేకానందరెడ్డి రాసిన వీలునామా ప్రకారం రావాల్సిన ఆస్తిని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ కుమార్తె సునీత ఇప్పించాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.