సునీతను అడ్డంగా ఇరికించిన వివేకా రెండో భార్య

వైఎస్ వివేకా హత్య కేసులో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఆస్తి తగాదాలు వివేకా హత్యకు ఓ కారణమంటూ ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన ఆరోపణలు ప్రస్తుతం నిజం అయ్యే ఛాన్స్ కనబడుతోంది. ఈ నేపధ్యంలోనే.. వివేకా రెండో భార్య షేక్ షమీమ్ తెరపైకి రావడంతో సునీత అడ్డంగా ఇరుక్కున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం షేక్ షమీమ్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. షేక్ షమీమ్ CBIకి ఇచ్చిన వాంగ్మూలంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు , వివేకాకి రెండుసార్లు వివాహం అయ్యిందని, వివేక కుటుంబ సభ్యులకు తమ వివాహం ఇష్టం లేదని షేక్ షమీమ్ చెప్పారు. 2010లో ఒకసారి , 2011లో మరొకసారి వివాహం చేసుకున్నాం అని షేక్ షమీమ్ వాంగ్మూలంలో చెప్పారు.
వివేకా కుటుంబ సభ్యుల నుంచి తనకు వేదింపులు కూడా వచ్చాయని చెప్పారు. వివేకాకు దూరంగా ఉండాలని సునీత రెడ్డి బెదిరించిందని షమీమ్ వెల్లడించారు. ఆస్తులెక్కడ తమకు రాస్తారేమో అని.. వివేకాకు చెక్ పవర్ రద్దు చేశారని, దానివల్ల చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని షమీమ్ వివరించారు. శివప్రకాశ్ రెడ్డి తనను చాలాసార్లు బెదిరించారని కూడా షమీమ్ వాంగ్మూలంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. వివేకా చనిపోవడానికి గంట ముందు తనతో మాట్లాడారని, బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్లో 8 కోట్లు వస్తుందని.. అది నా కొడుకు పేరు మీద భూమి కొంటానని చెప్పారని షమీమ్ సంచలన నిజాలు బయట పెట్టారు. శివ ప్రకాష్ రెడ్డి భయం వల్లే వివేక చనిపోయినా చూడడానికి వెళ్లలేదని షమీమ్ వివరించారు. వివేకా ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్ కన్నేశారని కూడా షమీమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా రెండో భార్య షేక్ షమీమ్ CBIకి ఇచ్చిన వాంగ్మూలంతో వివేకా హత్య కేసు బిగ్ టర్న్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరకు వివేకా దంపతులు ఈ కేసులో ఇరుక్కునే ఛాన్స్ అయితే కనబడుతోంది.
మరో వైపు ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను సవాల్ చేస్తూ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ఎంపీ అవినాష్ రెడ్డిని ఈ నెల 25వరకు అరెస్ట్ చేయొద్దని వెల్లడి౦చింది. దీంతో అవినాష్ రెడ్డికి ఊరట లభించింది.