ఏపీలో వచ్చేది మా రాజ్యమే.. మేము అధికారంలోకి రాగానే వైసీపీని చీల్చి చెండాడుతాం, అన్నీ వడ్డీతో సహాచెల్లిస్తామని ఊగిపోతున్న చంద్రబాబుకి ఓ సర్వే ఊపిరి ఆగే వార్త చెప్పింది. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతుందని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. ఏపీలో మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను.. 24 నుంచి 25 స్థానాలు వైసీపీనే గెలుచుకుంటుందని టైమ్స్ నౌ సర్వే తేల్చి చెప్పింది. ఇక లోక్ సభ స్థానాలే కాకుండా అసెంబ్లీ స్థానాలలో కూడా వైసీపీకే అధిక సీట్లు వస్తాయని గత0లో కొన్ని సర్వేలు వెల్లడించాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..అత్యధిక స్థానాలు వైసీపీకే వస్తాయని పలు సర్వేలు వెల్లడించాయి. ఇక సిఎం జగన్ జగన్ కూడా వైనాట్ 175 అంటూ పలు సందర్బాలలో ప్రస్తావించారు. ఇప్పుడు ఇదే మాటను సర్వే కూడా చెప్పడంతో.. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే..వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గనుక విజయం సాధించకపోతే..ఆయనకు అవే చివరి ఎన్నికలని చెప్పాలి. వైసీపీకి ఇదే ఫ్లో ఉంటే.. వచ్చే ఎన్నికల్లో టిడిపి ఓటమి ఖాయమనే చెప్పాలి. అదే గనుక జరిగితే.. ఇక చంద్రబాబు తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టే ఛాన్స్ ఉండదు. అంటే.. ఏపీలో ఇక ప్రతిపక్షమే ఉండదని చెప్పాలి. ఇక దేశవ్యాప్తంగా మోదీ మేనియా కొనసాగనుందని, కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ విజయం ఖాయమని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. బీజేపీ కూటమికి 292 నుంచి 338 స్థానాలు రావచ్చని పేర్కొంది. కాంగ్రెస్ కూటమికి 106 నుంచి 144 వరకు, ఇతరులకు 66 నుంచి 96 దాకా సీట్లు లభిస్తాయని తెలిపింది.