జగన్ వైపే ప్రజా మద్ధతు మెగా సర్వేలో సంచలనం బద్వేలులో బాబుకి భారీ షాక్

సిఎం జగన్ ఏది చేసినా సంచలనమే. రాష్ట్రంలో ఆయన పాలన దగ్గర నుంచి.. ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఓ రేంజ్ లో మైలేజ్ వస్తుంది.
తాజాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రారంభించిన జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఏపీ వ్యాప్తంగా ఏకకాలంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. 7 లక్షల మంది కన్వీనర్లు, గృహసారధుల సైన్యంతో 1కోటి 60 లక్షల కుటుంబాలను కలసి..ఇప్పటి వరకు అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించి…అనంతరం ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. దేశచరిత్రలోనే ఇది అరుదైన కార్యక్రమంగా చెప్పాలి. అయితే.. ఈ కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కొనసాగనుంది. వైసీపీ అనుకున్న విధంగానే.. ఈ కార్యక్రమం దిగ్విజయంగా తుది దశకు చేరుకుంది. అయితే.. ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం మరో 9 రోజుల పాటు పొడిగించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 84 లక్షల కుటుంబాలను కలిశారు. అలాగే ప్రజలు 63లక్షల మిస్డ్ కాల్స్ ఇచ్చి ప్రభుత్వం పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో కార్యక్రమంలో పార్టీ నేతలు రెట్టించిన ఉత్సాహంతో లక్ష్యసాధన దిశగా దూసుకెళ్తున్నారు. ప్రజలు సైతం జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి బ్రహ్మరథం పడుతున్నారు.

చంద్రబాబుకు కడపజిల్లాలో నిరసన సెగ తగిలింది. బద్వేలులో నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో గోబ్యాక్ అంటూ నిరసనలు తెలిపారు. దళితులను అవమానించిన చంద్రబాబు, నారా లోకేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దాసరి సుధా ఆధ్వర్యంలో దళిత నేతలు నిరసనకు దిగారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నల్ల జెండాలతో దళిత నేతలు నిరసనలు తెలిపారు. క్షమాపణ చెప్పిన తర్వాతే చంద్రబాబు బద్వేల్ రావాలని డిమాండ్ చేశారు. ఎవరైనా దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అంటూ చంద్రబాబు గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా లోకేష్ కూడా దళితులను అవమానించే విధంగా వ్యవహరించారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర౦లో పలు చోట్ల దళితులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ.. చంద్రబాబు స్పందించకుండా వెళ్లిపోయారు.