అవినాష్ నేరం చేశారు అనడానికి ఆధారాలు లేవు సమస్య పరిష్కరించాలని మోదీని కోరా౦ అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు

1.వివేకా కేసులో ఎంపీ అవినాష్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట..
ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐకి కోర్టు ఆదేశం.

2.అప్రూవర్ గా మారిన దస్తగిరి కడపలో కూర్చొని ట్రయల్స్ చేస్తున్నాడు..
నేరం చేశారు అనడానికి సీబీఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని అవినాష్ తరఫు న్యాయవాది తన వాదన.

3.మార్గదర్శిలో ఇన్వెస్ట్మెంట్ ఎంత? చెల్లింపులు ఎంత? వివరాలు బయట పెట్టడంలో రహస్యం ఎందుకు..
డిపాజిట్ల వివరాలు బయటపెట్టాలని సుప్రీం ఆదేశ౦..

4.వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ లకు 6 రోజుల సీబీఐ కస్టడీ..
ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న భాస్కర్ రెడ్డి, ఉదయ్.

5. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశం కోర్టు పరిధిలో ఉంది..
సమస్యను పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం జగన్ అనేకసార్లు కోరారని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి వెల్లడి.

6.జగన్ రుషికొండకు గుండు కొడితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏకంగా ఉండవల్లి కొండనే మింగేశాడు..
సీఎం నివాసానికి దగ్గర్లో ఆళ్ల మైనింగ్ మాఫియా జరుగుతోందని లోకేశ్ ఆరోపణ.

7.వివేకా హత్య కేసు ప్రపంచ పోలీసులకు ఓ కేస్ స్టడీ లాంటిది..
ఈ కేసులో నిందితులు చివరకు సీబీఐ అధికారులను కూడా బెదిరించారన్నారని చంద్రబాబు ఆరోపణ.

8.టీడీపీని దెబ్బతీయడం జగన్ తండ్రి వల్లే కాలేదు.. ఇంక జగన్ వల్ల ఏమవుతుంది..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా జగన్ ప్రజలను మోసం చేశారని అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు.

9.వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనేది జగన్ నిర్ణయం..
వైసీపీకి దూరమయ్యారనే వార్తలపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందన

10. జగన్ ఆడిన కోడి కత్తి డ్రామా ప్రజలకు అర్ధమైంది…
హక్కుల పరిరక్షణ సమితి కన్వీనర్‌ ఫారూక్ షుబ్లీ సంచలన వ్యాఖ్యలు.