1.మార్గదర్శి అక్రమాలపై కొనసాగుతున్న సీఐడీ సోదాలు…
మార్గదర్శి రశీదు డిపాజిట్ల ముసుగులో భారీగా బ్లాక్మనీ మార్పిడి జరిగిందని గుర్తించిన సీఐడీ.
2.కె.సి.ఆర్ ఢిల్లీ సిఎం కెజ్రివాల్కు 1,000 కోట్లు, తోట చంద్రశేఖర్కు 100 కోట్లు ఇచ్చారు..
ప్రధాని కావాలన్న కాంక్షతో దోచుకున్న సొమ్ముని కె.సి.ఆర్ పంచుతున్నారన్నారని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.
3.మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్..
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో దీర్ఘకాల వ్యాధులతో బాధ పడుతున్న పలువురికి మెరుగైన వైద్యం, తక్షణ సాయం.
4. నిస్వార్థంగా ప్రజల ముంగిట్లో సేవలందిస్తున్న వలంటీర్ల సేవకు ప్రభుత్వం ఏటా పురస్కారాలు..
అందులో భాగంగా ఈ ఏడాది మొత్తం 8,408 మందికి 9 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం.
5.అవినాశ్ రెడ్డిని 25 వరకు అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో సునీత పిటిషన్..
తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన సునీత.
6.రెండో రోజు లాయర్లతో కలిసి సీబీఐ ఎదుటకు అవినాశ్ రెడ్డి
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొనసాగుతున్న విచారణ.
7.నేడు చంద్రబాబు పుట్టినరోజు..
బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన విజయసాయిరెడ్డి.
8. పల్లాకు పార్టీని నడపడం ఇష్టం లేకపోతే రాజీనామా చేయాలి..
విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఆ పార్టీ గాజువాక ప్రాంత నాయకులు ముక్తకంఠంతో డిమాండ్.
9.వైఎస్ వివేకా కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరికి పోలీసులు అదనపు భద్రత..
తనకు బెదిరింపులు వస్తున్నాయని దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు.
10. రెండు తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు..
వచ్చే ఏడాది ఈ సమయానికి దుర్మార్గ పాలన అంతం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నక్కా ఆనంద్ బాబు వెల్లడి.