పవన్ మార్క్ స్కెచ్ సీఎం జగన్ గ్రాండ్ విక్టరీ బాబుకి హడల్, నిద్రపట్టని రాత్రులు

విన్నారుగా హరిరామ జోగయ్య మాటలు. ఈ మాటలు ఆయన రాసుకొని చదివినట్లుగా లేవు.. స్వయంగా పవన్ కళ్యాణ్ రాసిచ్చిన స్క్రిప్ట్ లా ఉందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పలేకనే జోగయ్య తో ఇలా చదివించారని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తమకు పొత్తులు ఒకే.. కానీ ఓ కండీషన్. అదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సిఎం అభ్యర్ధిగా ప్రకటించాలని వీరి భావన. గౌరవం అంటే ఏదో పదవిలో కూర్చోబెట్టడం కాదు రాష్ట్ర పగ్గాలు కాపులకు అప్పజెప్పడం అని హరిరామ జోగయ్య చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ ని సిఎం అభ్యర్ధిగా ప్రకటిస్తేనే.. ఏ పార్టీతో అయినా పొత్తులకు సిద్దమని ఇన్ డైరెక్ట్ గా అర్ధమవుతుంది. మరి చంద్రబాబు ఈ త్యాగానికి సిద్దమవుతారా..? పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్టుగా 40 స్థానాలు ఇచ్చి.. పొత్తులలో భాగంగా ఆయనను సిఎం అభ్యర్ధిగా బాబు ఒప్పుకుంటారా..? ఇలా అయితే.. లోకేష్ సంగతి ఏంటి..? నారా వారి రాజకీయ భవిష్యత్ ఏంటి..? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయిన పవన్ కళ్యాణ్ కి అన్ని సీట్లు బాబు కేటాయించడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ చేస్తున్న డిమాండ్ ని చంద్రబాబు ఎట్టిపరిస్థితులలోనూ ఒప్పుకోరని అంటున్నారు. ఇదే గనుక జరిగితే.. వచ్చే ఎన్నికల్లో టిడిపి – జనసేన పార్టీల మధ్య పొత్తులు ఉండవని.. పొత్తులు లేని పక్షంలో ఓట్లు చీలి సిఎం జగన్ అనుకున్న విధంగా మళ్ళీ గ్రాండ్ విక్టరీ సాధించడం ఖాయంఅని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ డిమాండ్ పై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.