కేంద్రంపై చంద్రబాబు టార్గెట్ బిక్ షాకిచ్చిన బీజేపీ

కేంద్రంపై చంద్రబాబు టార్గెట్ ఏంటా అని ఆలోచిస్తున్నారా..? ఏదో ఒక రాయి వేశారు. చివరికి ఆ రాయి వచ్చి చంద్రబాబు తలకు తగిలి బొప్పి కట్టింది. ఎన్నికలు వచ్చే సమయానికే.. విభజన హామీలు గుర్తుకు వస్తాయి. ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం ఏదో తూతూ మంత్రంగా ప్రశ్నిస్తారు.
ఇదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు విభజన హామీలపై తాజాగా చేసిన డిమాండ్ పై స్పందించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కౌంటర్ ఇచ్చారు.తాను వదిలేస్తే జగన్ అప్పట్లో రాష్ట్రమంతా తిరిగారని చంద్రబాబు అంటున్నారని, అప్పట్లో జగన్ పాదయాత్రలు చేస్తుంటే వదిలేసి ఇప్పుడు కేంద్రాన్నిటార్గెట్ చేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. నా వద్ద చాలా ప్రశ్నలు ఉన్నాయి… చంద్రబాబు అనుసరించిన విధానం అభ్యంతరం అంటూ తీవ్ర స్వరంతో చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు. ఒంగోలు లో అంతర్జాతీయ యోగా డే కార్యక్రమంలో పాల్గొన్న సోము.. పలు అంశాలపై స్పందించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా వద్దంటే ఎవరు స్పందించలేదని, ఆయన సభలు అడ్డుకోలేదని సోము గుర్తుచేశారు. రైల్వేజోన్ విషయంలో కేంద్రంలో చక్రం తిప్పుతాను, అయిదుగురు ప్రధాన మంత్రులను మార్చానని తరచుగా చంద్రబాబు నాయుడు చెబుతారని, రైల్వే జోన్ ఎందుకు తీసుకురాలేదని సోము ప్రశ్నిం చారు. ఇలాంటి అంశాలు తన దగ్గర చాలా ఉన్నాయన్నారు.