అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు గానీ.. ఇప్పుడు ఏదో ఇరగపొడుస్తారట. అధికారం ముసుగులో ప్రజలకు చేసింది శూన్యం.. వారి జేబులు నింపుకున్నది మాత్రం వాస్తవం. ఏదో తమ సొమ్ము ఇస్తున్నామని బిల్డప్ లు.. ఇదే జరిగింది గత ప్రభుత్వంలో.. ఈ మాట మేము అంటున్నది కాదు. స్వయంగా ప్రజలే అంటున్న మాటలు ఇవి. సీన్ కట్ చేస్తే.. అనంతపురం జిల్లా రాప్తాడు రాజకీయాలలో మాటల యుద్దం తారా స్థాయికి చేరుకుంది.
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రజలకు మంచి చేస్తున్నా.. పరిటాల ఫ్యామిలీ మాత్రం నిరాధర ఆరోపణలు చేస్తోంది. పరిటాల ఫ్యామిలీ గతంలో ప్రజలకు చేసింది శూన్యం.. దోచుకుంది మాత్రం బోలెడంత అని స్వయంగా రాప్తాడు ప్రజలే చెప్తున్నారు. పరిటాల వాళ్ళు భూమికి పచ్చని రంగేసినాము అని సినిమా పాటలు పాడి ఏళ్ళ తరబడి జనాలని మభ్యపెట్టి రక్తం రంగులు పూసి కాలం గడిపిస్తే .. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాత్రం..
నాలుగు రిజర్వాయర్ల నిర్మాణం చేసి, గంగలకుంట బొమ్మపర్తి చెరువులకు జల కళ తెచ్చి.. పేరూరు డ్యామ్ కు నీళ్ళు తెచ్చి… ఊరూరా ఉచిత బోర్లు వేయించి.. ఒక్క రాప్తాడు నియోజకవర్గానికే కాకుండా చుట్టూ పక్కల నియోజకవర్గ౦లో కూడా ఎన్నో గ్రామాలకి నీళ్లు ఇచ్చి.. రైతుకి తోడై పుష్కలంగా పంటలు పండే విధంగా.. భూమికి పచ్చని రంగేసినాడు. మరి ఇంతటి జలయజ్ఞం మీ పరిటాల ఫ్యామిలీకి కనబడలేదా.. ? అర్హులందరికీ పక్కా గృహాలు నిర్మించి.. సొంతింటి కలను సాకారం చేయడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, రాప్తాడు ప్రజానీకానికి 30 వేల ఇళ్ళు కట్టిస్తున్నా.. ఇంతటి అభివృద్ది పరిటాల ఫ్యామిలికి కనపడలేదా..? 2019 ఎన్నికలకు ముందు ఏవైతే చేస్తానని హామీ ఇచ్చారో.. అప్పటి నుంచి ఇప్పటి వరకు
వాటి గురించే తపించాడు.. ఆశ, శ్వాస వాటి మీదనే పెట్టి ఇప్పటి వరకు పని చేసాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి.. దాదాపు 90 శాతం వరకు చేసి చూపించాడు. మాట నిలబెట్టుకున్నాడు.
సాధ్యం కాదు అనుకున్న వాళ్ళ అందరు షాక్ అయ్యలా అమ్మ డైరీకి భూమి పూజ చేసి 20 కోట్ల సొంత ఖర్చు స్థాపించి నియోజకవర్గంలో 10వేల మంది ఆడపడుచులకి అంకితం ఇచ్చాడు. రాప్తాడు నియోజకవర్గం మహిళా పాడి రైతులే యజమానులు. రోజు లక్ష లీటర్ల పాలను సేకరించి, వాటిని అమ్మి.. వచ్చిన ప్రతి పైసా ఆదాయాన్ని నిర్వహణ ఖర్చు మినహా సభ్యులందరూ సమానంగా పంచుకోనున్నారు. రైతుకి నీళ్లు ఇవ్వాలి , పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వాలి , నిస్సహాయతలో ఉన్న మహిళలకి దారి చూపించాలి అని ఆయన సంకల్పం వల్లే ఇవన్నీ జరిగాయి. అందుకే ఇంతలా చేసి చూపిస్తున్నారు. ఇంత చేసిన తమకి.. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి అండగా ఉంటామని,, మళ్ళీ ఆయనణనే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని రాప్తాడు ప్రజానికం తమ అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.