వారికి సీఎం జగన్ గుడ్ న్యూస్ నేరుగా బ్యాంక్ ఖతాలో నిధులు జమ

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవరత్నాల్లో కీలకమైన అమ్మఒడి నిధులకు ముహూర్తం ఖరారు చేసారు. ఈ నెల 28న కురుపాం వేదికకా అక్కడ జరిగే సభలో పాల్గొని ఈ ఏడాది అమ్మ ఒడి నిధులు విడుదల చేయనున్నారు. దాదాపు 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ 15 వేలు చొప్పున నిధులు జమ కానున్నాయి. నిధుల విడుదలతో పాటుగా బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అర్హుల జాబితాను ప్రకటించారు. ఇప్పటికే మూడు సార్లు ఈ నిధులను విడుదల చేసిన సీఎం..నాలుగో విడత ఇచ్చేందుకు సిద్దమయ్యారు. నవరత్నాల అమల్లో భాగంగా ప్రతీ ఏటా విద్యా అమ్మఒడి నిధులను సీఎం జగన్ విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి.నేడు లబ్ధిదారుల జాబితా సిద్దం చేసారు. విద్యార్ధులకు 75 శాతం హాజరుతో పాటుగా ప్రభుత్వం నిర్దేశించిన నిబందనలకు అనుగుణంగా ఎంపికైన 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు జమకానున్నాయి. ఆదాయపన్ను చెల్లించేవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు అమ్మఒడికి అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్‌ కాకుండా పాలిటెక్నిక్, ట్రిపుల్‌ ఐటీ వంటి కోర్సుల్లో చేరేవారికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తారు. ఈ అమ్మఒడి పథకం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అమ్మఒడి పథకం ద్వారా ఎంతో మంది పేద విద్యార్ధులు క్రమం తప్పకుండా బడికి వెళ్తున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేద విద్యార్ధులు చదువుకు దూరంగా ఉండకూడదని.. సిఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని రూపొందించారు.