టోటల్ గా ఏపీలో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఎన్నికలు నేడా.. రేపా అన్న రీతిలో అనేంతలా రాజకీయ నాయకుల ప్రచారాలు ఊపందుకున్నాయి. పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసిన వారాహి యాత్రతో రాజకీయాలు మరింత హీటెక్కాయి. ముఖ్యంగా కాపు రాజకీయం మరింతగా కాక రేపుతోంది. పవన్ కల్యాణ్ వర్సెస్ కాపు నేతలన్నట్లుగా మారింది రాజకీయం. కాపు లీడర్ అయిన పవన్‌కి.. కాపు నాయకులతోనే బదులిప్పించాలని అధికార వైసీపీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కాపు నేతలంతా వరుసగా పవన్ కల్యాణ్‌ని టార్గెట్‌గా చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాపులంతా తమ వైపే ఉన్నారని నిరూపించుకునేందుకు వైసీపీ పవన్ కి కాపుల చేతనే కౌంటర్ లు ఇస్తోంది. అసలు పవన్ కళ్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాలోనే తన యాత్రను ఎందుకు మొదలు పెట్టారు అనడానికి కూడా.. ప్రధానంగా ఒక్కటే సమాధానం వస్తోంది. గోదావరి జిల్లాల్లో కాపు ఓట్లు అధికంగా ఉన్నాయి కాబట్టి. కాపులంతా ఏకమైతే.. తన గెలుపు చాలా ఈజీ అని పవన్ కళ్యాణ్ ఇప్పటికీ చాలా బలంగా నమ్ముతున్నారు. పవన్ కల్యాణ్ స్పీచ్‌ల్లో కాపుల ప్రస్తావన తరచుగా వస్తోంది. అధికార వైసీపీలో ఉన్న కాపు నాయకులను టార్గెట్ చేస్తున్నారు. ఈ మధ్య వైసీపీ ఎమ్మెల్యేల గురించి వ్యక్తిగతంగా కూడా వెళ్తున్నారు. వైసీపీలో ఉన్న కాపు నాయకులను టార్గెట్ చేస్తున్నారు.
తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు భారీ కౌంటర్ ఇచ్చారు. మీరు రౌడీలా మాట్లాడటం అస్సలు కరెక్ట్ కాదండీ అంటూ.. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిని అన్యాయంగా విమర్శిస్తున్నారని ముద్రగడ పవన్ పై నిప్పులు చెరిగారు. ఇక ముద్రగడ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు కాపు సంక్షేమ సేన కూడా రియాక్ట్ అయ్యింది. కాపులను తాకట్టు పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే.. కాపులు.. తమలో తామే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఏది ఏమైతే.. పవన్ పెట్టిన పొలిటికల్ చిచ్చు.. చివరికి కాపులలో కాక పుట్టిస్తుందని బయట జనం చర్చించుకుంటున్నారు.