అడుక్కునే సంఘానికి అధ్యక్షుడు పవన్ బాబు.. బాబు.. అంటూ అసెంబ్లీలో ఒక్క అడుగుపై ట్రోల్స్

ఓ వైపు చంద్రబాబు, మరో వైపు పవన్ కళ్యాణ్. వీరిద్దరిదీ ఒకే స్థితి.. ఒకే పరిస్థితి. అసలు వీరిద్దరికీ ఏమైంది. ఇద్దరిది ఒకే స్థితి.. ఏమిటి ఈ పరిస్థితి.. అని ఇద్దరూ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఒకే డ్యూయెట్ పాడుకుంటున్నారు. పార్టీ గెలిస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని ఒకరు. ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీలోకి వెళ్లగలనని మరొకరు.. ఇలా ఇద్దరికి ఒకే పరిస్థితి నెలకొంది. హతవిధి. రానున్న ఎన్నికలు టీడీపీ భవిష్యత్.. కాదు కాదు.. చంద్రబాబు రాజకీయ భవిష్యత్ ను నిర్దేశించేవి. లోకేష్ కి రాజకీయ మనుగడ బలంగా కొనసాగాలంటే అధికారంలోకి వచ్చి తీరాలి. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే.. ఈ కౌరవ సభను గౌరవ సభగా మార్చి.. అప్పుడు అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు శపథం చేసారు. ప్రతీ సందర్భంలోనూ పార్టీ నేతలతో చెబుతూనే వస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిచినా.. పార్టీ గనుక ఒడిపోతే.. ఇక చంద్రబాబు ఎప్పటికీ అసెంబ్లీలో అడుగు పెట్టే ఛాన్స్ లేదు. చంద్రబాబు కధ ఇలా ఉంటే.. పవన్ కళ్యాణ్ కథ కూడా ఇదే తరహాలో ఉంది. సింగిల్ గా ఎన్నికలకు వెళ్లి విజయం సాధించలేమని భావిస్తున్న పవన్ కళ్యాణ్ బాబు.. బాబు.. ఈసారికి నన్ను గెలిపించండి అంటూ అడుక్కునే స్థితికి దిగజారారు అంటే.. పవన్ రాజకీయ స్థితి ఎక్కడికి దిగజారిందో అర్ధం చేస్కోవాలి. ఇక ఈ క్రమంలోనే వైసీపీ పవన్ పై మాస్ ర్యాగింగ్ స్టార్ట్ చేసింది. అదుక్కుంటే పదవి వస్తుందా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ను ఓడించేందుకు పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారు. కానీ తాము పొత్తుల గురించి ఎలాంటి ప్రకటన లేదు. మొత్తానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరిది ఒకే స్థితి.. ఏమిటి ఈ పరిస్థితి అన్న చందాన మారిందన్నమాట.