రాజకీయాలకు గుడ్ బై..!

ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ ఏపీ రాజకీయాలలో అసంతృప్తులు నెమ్మదిగా బయటపడుతున్నారు. ఇదంతా రాజకీయాలలో కామన్. తమలో తామే కొట్లాడుకోవడం. సీటు తమకు నచ్చని వాళ్ళకిస్తే.. పని చేయను అని అలగటం. ఇలా రకరకాల కంప్లయింట్స్ ఇప్పుడిప్పుడే బహిర్గతం అవుతున్నాయి. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వైసీపీ నాయకత్వం కొత్త డ్రామాలకు తెర తీసిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. తన తమ్ముడికి వ్యతిరేకంగా పోటీ చేయబోనని ఆయన తేల్చి చెప్పారు. అవసరమైతే రాజకీయాలకు గుడ్ బై చెబుతానన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో తన మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. అనుమానం ఉన్నచోట మనుగడ సాగించడం కష్టమని ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఎమ్మెల్యే కోటంరెడ్డి చేస్తున్న విమర్శులు కలకలం రేపుతున్నాయి. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించినా శ్రీధర్ రెడ్డి మెండిచేయి దక్కింది. అయితే జిల్లా నుండి కాకాని గోవర్ధన్ రెడ్డికి జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో శ్రీధర్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆ తర్వాత సీఎం జగన్ ఆయనను పిలిపించి మాట్లాడారు. అలక తీరింది.. ఇంకెలాంటి సమస్య లేదు అనుకుంటున్న తరుణంలో ఆయన చేస్తున్న తిరుగుబాటు పలు చర్చలకు దారితీస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరుపై శ్రీధర్ రెడ్డి విమర్శలు చేశారు. డ్రైనేజీ పనులు పూర్తి చేయకపోవడంపై డ్రైనేజీలో నిలబడి శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు. టీడీపీ ప్రభుత్వ హయంలో డ్రైనేజీ పనులు పూర్తి చేయకపోవడంతో తాను నిరసనకు దిగారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినా కూడా ఈ సమస్య తీరలేదని శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు. అలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న కోటంరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. మరి మున్ముందు ఏం జరగబోతుందో అనేది చూడాలి.