చెప్పేది శ్రీరంగ నీతులు చేసేది చెత్త పనులు. తామేదో గొప్ప నాయకులు అని, తాము చేసేది అంతా కరెక్ట్ అని తెగ గొప్పలు చెప్పుకోవడం టిడిపి నాయకులకు అలవాటేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాలలో ఉండాల్సింది సహనం, ఓర్పు. కానీ టిడిపి లో కొందరు నాయకులు సహనం, ఓర్పు మరచి.. నిత్యం పోలీసులపై నోరు పారేసుకోవడం, చేయి విదిలించడం లాంటివి చేస్తున్నారు. స్వయంగా చంద్రబాబే పోలీసులను నోటికొచ్చినట్టు తిట్టిన సందర్బాలు ఉన్నాయి. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపధ్యంలోనే.. కొల్లు రవీంద్ర సహనం కోల్పోయి పోలీసులపై ఎలా చేయి చేసుకున్నారో ఈ వీడియొలో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒక రాజకీయ నాయకుడు అన్న సంగతి మరచి పోలీసులపై ఇలా దౌర్జన్యయం చేయడం కరెక్ట్ కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. ఆయన అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో పోలీసులు తమ పని తాము చేసుకుపోతున్నారు. తమ విధులు తాము చేసుకుంటుంటే.. టీడీపీ నాయకులు మాత్రం తమను తప్పుబడుతూ.. ఇబ్బందిపెడుతున్నారని పోలీసులు ఆవేదన తెలుపుతున్నారు.