పచ్చ మీడియాతో నోరు జారిన పవన్ ఎర్రగడ్డలో బెడ్ రెడీ.. నిండా మునిగిన చంద్రబాబు

పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది.. అన్న సామెత ప్రకారం.. పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి అలానే ఉంది. దత్తపుత్రుడు.. దత్తపుత్రుడు అని సిఎం జగన్ ఊర్కనే అనరు. ఆయన మాట్లాడే తీరు అలానే ఉంటుంది. ఇప్పుడు తాజాగా పచ్చ మీడియాలో జగన్‌ను పంపించేద్దాం అని హెడ్డింగ్ పెట్టారు. ఓటర్లు కులపరంగా విడిపోవద్దని రాశారు. ఇవన్నీ చూస్తే ఎవరి ఎజెండా కోసం పవన్ తన జెండాను దింపేశారో బాగా అర్థమౌతోంది. అన్ని పార్టీలు ఏకం అవ్వాలని, కులాల పరంగా విడిపోవద్దని పవన్ కల్యాణ్‌ అన్నట్టుగా ఓ పచ్చ మీడియాలో రాశారు. ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి.. గత ఎన్నికల్లో నా వాళ్ళే నన్ను గలిపించలేదని కాపులను ఆడిపోసుకున్నది ఎవరు పవన్. ఇప్పుడేమో పచ్చ మీడియా ముందుకు వచ్చి.. నేను కుల రాజకీయాలు చేయట్లేదు అంటే నమ్మేయడానికి జనం ఏమైనా పిచ్చివారిలా కనబడుతున్నారా..? సిఎం జగన్ పాలన బాగోలేదనుకుంటే.. కూటములతో పనేంటి? 2019లో చంద్రబాబును రక్షించటానికి విడిగా వెళ్లిన పవన్ కల్యాణ్‌ తాను మునిగాడు. పొత్తులు పెట్టుకోవటానికి ఒక సిద్ధాంత బలం లేదు కాబట్టే.. వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అంటూ ఒక డైలాగ్ అందుకున్నారు. ఇంతకు మించి వీరు రాజకీయంలో నీతి లేదు, నిజాయితీ లేదు.

ఒకసారేమో నాకు సిఎం పదవి వద్దు అంటారు. ఒకసారేమో నేనే సిఎం అంటాడు. సిఎం పదవి ఇస్తే తీసుకోవడానికి సిద్దంగా ఉన్నాను అంటాడు. ఒంటరి పోరాటం చేసి బలవ్వడానికి సిద్దంగా లేను అంటాడు. తమ నాయకుడు సిఎం అవుతాడని ఒక వైపు జనసైనికులంతా కొండంత ఆశలు పెట్టుకుంటే వారి ఆశలను గంగలో కలిపేశారు. ఏమిరా బాలరాజు.. నీ వల్ల పార్టీకి ఉపయోగం. సిఎం జగన్ ను ఓడించేందుకు ప్రతిపక్షాలు అండ్ కో రౌండప్ చేసి.. మరీ కుట్రలు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెట్టిందే కేవలం జగన్ సర్కారుని విమర్శించడానికి అనే౦తలా ఉంది ఆయన మాట్లాడే తీరు చూస్తుంటే.

పైగా తనని అంతమొందించటానికి కుట్రలు జరుగుతున్నాయని చెప్పడం పెద్ద కామెడీ అని చెప్పాలి. అందుకంటే.. 2019 ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వంపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇదే తరహా నిరాధర ఆరోపణలు చేసి అడ్డంగా దొరికిపోవడం తప్ప.. తమరికి సిటికెడు సింపతీ కూడా రాదని స్వాయంగా తమరి ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ఆరోపణలకు ఆధారాలు చూపించాలి. ఆధారాలు చూపించనట్లైతే పవన్ కల్యాణ్‌ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే.. పవన్ కి పిచ్చి పట్టిందని ఎర్రగడ్డలో చేర్పించాలని అంటున్నారు.

చంద్రబాబు ఇంటికి వెళ్ళిన మాట వాస్తవం అని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కానీ ప్యాకేజీ కోసమో.. సీట్ల పంపకాల కోసమో కాదట. రాష్ట్ర అంశాలపైనే చర్చ జరిగిందని పవన్ చెప్తున్న మాటలని ఎవ్వరైనా నమ్ముతారా..? అంటే నమ్మరని అంటున్నారు.. నిపుణులు. మూడవసారి చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత పవన్ చేసిన ఒక మాట జనసైనికులకు తీవ్ర నిరాశ కలిగించింది. అదే.. నేను సీఎం రేసులో లేనని. ఈ ఒక్క మాటతో కొందరు అభిమానులలో ఆవేశం కట్టలు తెచ్చుకుంది. ఇదంతా గమనించిన పవన్.. మళ్ళీ రూటు మార్చి.. మీరు చేస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అంటూ మరో డైలాగ్‌ తో వారాహి మీద ప్రసంగాలు ఇస్తున్నారు. ఇదంతా వింటుంటే తికమకగా ఉంది కదా. అవును.. ఫ్యాన్స్ ను ఇలా తికమక చేసి.. చివరికి ఎంతో కొంత ప్యాకేజీ తీసుకొని తీరా ఎన్నికల సమయానికి టిడిపికి సపోర్ట్ చేయడం ఖాయం అన్న వాదనలు వస్తున్నాయి.