పవన్ కళ్యాణ్ పాత్రకు తగ్గట్టుగా మారిపోతుంటాడు. అయితే కొంత మంది నటీనటులు మాత్రమే పాత్రకు ప్రాణం పోసేలా ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో జీవిస్తుంటారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ దేవుడి పాత్రలను వేసే సమయంలో అంతే నిష్టతో ఉండేవారు. చెప్పులు కూడా వేసుకునేవారు కాదట. ఆహార శైలిని కూడా మార్చుకునేవారట. కేవలం సాత్విక ఆహారాన్ని తీసుకునేవారట. ఇక సుమన్ అయితే అన్నమయ్య సినిమా షూటింగ్ జరిగినన్నీ రోజులు నేల మీదే పడుకునేవారట.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలానే చేయబోతోన్నాడట. గతంలో ఆయన గోపాల గోపాల సినిమా షూటింగ్ సమయంలోనూ ఆహార పద్దతులను పాటించాడట. సాత్విక ఆహారాన్నే తీసుకునేవాడట. అందులో కృష్ణుడిగా పవన్ కళ్యాణ్ నటింంచిన సంగతి తెలిసిందే. ఆ పాత్రలోనే స్వచ్చత, దైవత్వానికి తగ్గట్టుగా ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లోనూ జీవించాడట.
ఫిబ్రవరి 14 వరకు అమెజాన్ వాలెంటైన్స్ డే స్పెషల్ | వాలెంటైన్స్ డే గిఫ్ట్‌లపై గొప్ప తగ్గింపు ధరలు
ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించబోతోన్నాడన్న సంగతి తెలిసిందే. వినోదయ సిత్తం అనే తమిళ సినిమాకు రీమేక్‌గా రాబోతోన్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ కూడా కనిపించబోతోన్నాడు. ఇప్పుడు ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ తన హెయిర్ స్టైల్‌ను కూడా మార్చేశాడు. బాడీని కూడా మరింత ఫిట్‌గా ఉంచుకునేందుకు వ్యాయామం చేస్తున్నాడట.
ఇక సాత్విక ఆహారాన్నే తీసుకుంటున్నాడట. ఈ మూవీ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ తన సినిమాలను ప్రకటిస్తూనే పోతోన్నాడు. ఇప్పటికే క్రిష్ హరిహర వీరమల్లు సెట్స్ మీదుంది. హరీష్ శంకర్‌తో చేయాల్సిన సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చెప్పలేం.
సుజిత్ సినిమాను ఈ మధ్యే ప్రకటించారు. ఇప్పుడు వినోదయ సిత్తం సినిమాను సెట్స్ మీదకు తీసుకురాబోతోన్నాడట. మరి ఈ సినిమాలన్నీ ఎప్పుడూ పూర్తి అవుతాయో ఆ దేవుడికే తెలియాలి. అసలే పవన్ కళ్యాణ్ అటు రాజకీయంగా ఫుల్ బిజీగా ఉంటోన్న సంగతి తెలిసిందే.