సీనియర్ నటుడు బ్రహ్మాజీ ముఖ్య పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘#మెన్ టూ’. సోమవారం ఈ సినిమా టీజర్‌ను శర్వానంద్ విడుదల చేశారు. శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మౌర్య సిద్ధవరం నిర్మించారు. కిరాక్ పార్టీతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన మౌర్య.. ‘#మెన్ టూ’ సినిమాలో నటిస్తూనే నిర్మించటం విశేషం. శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వం వహించారు. సాధారణంగా లేడీస్ వల్లనే మగవాళ్లకు ఇబ్బందులు అనేలా చాలా సినిమాలే చూశాం. అయితే రొటీన్‌కి భిన్నంగా లేడీస్ వల్ల జెంట్స్‌కి వచ్చే సమస్యలేంటి? అనే కాన్సెప్ట్‌తో ‘#మెన్ టూ’ సినిమాను రూపొందించారు.
‘#మెన్ టూ’ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు బ్రహ్మాజీ ఓ లొకేషన్ గుట్టు బయట పెట్టేశాడు. ఇంతకీ ఏంటా గుట్టు అని అనుకుంటున్నారా? సెట్స్‌లో మందు తాగారట. అయితే ఆ బిల్లు నిర్మాత మౌర్యకి తడిసి మోపెడైంది. ‘#మెన్ టూ’ సినిమా షూటింగ్‌లో భాగంగా పబ్ సీన్స్‌ని వారం రోజుల పాటు చిత్రీకరించారట. అక్కడ మందు తాగే సన్నివేశాలున్నాయి. దీంతో బ్రహ్మజీ సహా ఇతర నటీనటులు ఒరిజినల్ బీర్స్‌నే తాగారట. దీంతో తిండి కాకుండా కేవలం బీరుకి లక్షన్నర రూపాయలు ఖర్చు అయ్యాయట. ఏం చేద్దాం నిర్మాతకు ఆ బిల్లు కట్టక తప్పలేదు.
నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం జరిగిన ప్రెస్‌మీట్‌కి హీరో శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ను లాంచ్ చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో శర్వాతో పాటు డైరెక్టర్ సుధీర్ వర్మ, శరణ్ కొప్పిశెట్టి, బ్రహ్మాజీ, మౌర్య సిద్ధవరం, దర్శకుడు శ్రీకాంత్ జి.రెడ్డి , హర్ష చెముడు తదితరులు పాల్గొన్నారు.