1.నేడు సీఎం జగన్ విశాఖ, విజయనగరం జిల్లాల టూర్..
భోగాపురం విమానాశ్రయానికి భూమి పూజ.. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన.
2.అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలకు రంగం సిద్దం.
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని సిఎం జగన్ అధికారులను ఆదేశ౦.
3.పులివెందుల నియోజకవర్గంలోని సురభి గ్రామం నాగలగుట్టపల్లెలో రియల్ ఎస్టేట్ వెంచర్న దౌర్జన్యంగా దున్నేసిన టీడీపీ నేతలు..
32మందిని గుర్తించి వారిపై కేసు నమోదు.. బీటెక్ రవితోపాటు మహేశ్వరరెడ్డి, మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.
4.ఎన్టీఆర్ బతికుండగానే ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆ కార్యక్రమానికి రజనీకాంత్ పూర్తిగా సహకరించారు…
వైస్రాయ్ హోటల్లో నిర్వహించిన సమావేశానికి రజనీకాంత్ మద్రాసు నుంచి వచ్చి బాబుకు మద్దతు ప్రకటించారని గుర్తుచే సిన లక్ష్మీపార్వతి.
5.వివేకా కేసులో సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న తీవ్ర అస్వస్థత…
మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్క తరలింపు.
6.చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వ సిట్..
సుప్రీం కోర్టులో నేడు విచారణ.
7.మళ్లీ వాయిదా పడిన జగన్ కొవ్వూరు పర్యటన
ఈ నెల 5న జరగాల్సిన పర్యటన.. వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఈ నెల 24కు వాయిదా.
8. నియోజకవర్గంపై దృష్టి సారించాల్సిన ఉన్నందున రాజీనామా చేశా ..
రీజినల్ కోఆర్డినేటర్ పదవి నుండి తప్పుకోవడంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ.
9. రజనీకాంత్ సింగిల్ గా వచ్చి వెళ్ళిపోయాడు. వైసీపీ వాళ్ళు గుంపులుగా వచ్చి హడావిడి చేస్తున్నారు.
ఆయన ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. అందుకే వైసీపీ వాళ్ళు ప్యాంట్లు తడిపేసుకుంటున్నారని ఎద్దేవా..
10.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో రహదారులు దిగ్భంధన…
రహదారులను దిగ్భందించిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు.