1.సీఎం జగన్ పోలవరం పర్యటన..
ప్రాజెక్ట్ పనులపై అధికారులతో సమీక్ష.. పనులు పరిశీలన.
2.జగన్ సర్కారు కు కేంద్రం మరో గుడ్ న్యూస్..
పోలవరం ప్రాజెక్ట్ పనులకు 12,911 కోట్లకు గ్రీన్ సిగ్నల్..
3.బీజేపీకి, వైసీపీకి మధ్య ఎలాంటి సంబంధం లేదు..
వైసీపీకి 80 శాతం మంది ప్రజల మద్దతు ఉందని సజ్జల వెల్లడి.
4.కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం..
కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటుపై కేబినెట్ కమిటీలో చర్చిస్తామని మంత్రి బొత్స వెల్లడి
5.ప్రభుత్వం మా డిమాండ్లు చాలావరకు నెరవేర్చింది..
ఉద్యమం కొనసాగింపుపై ఈ నెల 8న నిర్ణయం తీసుకుంటామని బొప్పరాజు వెల్లడి.
6.మోదీ స్థానంలో నా మిత్రుడు ప్రధాని కావాలి…
అమిత్ షా నాయకత్వంలో దేశం మరింత ముందుకెళుతుందని కేఏ పాల్ వెల్లడి.
7.పోలవరం ఎత్తు తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసింది..
పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందన్న నాదెండ్ల మనోహర్.
8. కత్తిపూడి జంక్షన్ నుండి పవన్ కళ్యాణ్ యాత్రను ప్రారంభిస్తారు..
అన్నవరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత యాత్ర నిర్వహించనున్నారని నాదెండ్ల మనోహర్ క్లారిటీ.
9.ప్రభుత్వ పనులకు బిల్లులు ఆలస్యం కావడం కొత్తేమీ కాదు..
చిన్న పనులకు కూడా బిల్లులు వెంటనే కావాలంటే ఎలా అని మంత్రి ఆదిమూలపు సురేశ్ అసహనం
10.అక్రమంగా ఆస్తులు రాయించుకున్నారని కాకినాడ ఎంపీ గీతపై ఆమె వదిన ఫిర్యాదు..
2006లో తన భర్త కృష్ణకుమార్‌తో తన ఆస్తులను బలవంతంగా రాయించుకున్నారని ఫిర్యాదు.