జనసేన వేలం ఖాయం పరువంతా బజారుపాలు

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పదేళ్ళు కావస్తోంది అయినా పార్టీకి సరైన గుర్తింపు లేదని, ఇకపై కూడా రాదని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. పవన్ కల్యం పార్టీ స్థాపించిన సమయంలో ఆయన పోటీ చేయకుండా.. బిజేపి – టిడిపి లకు మద్దతు ప్రకటించారు. ఈ పదేళ్ళ కాలంలో ఆయన గెలుచుకున్న సీట్లు కేవలం ఒకటి మాత్రమే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలలో ఒక స్టాండర్డ్ అంటూ లేదని.. స్వయంగా కాపు వర్గానికి చెందిన ప్రజలే విమర్శలు చేస్తున్నారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే తమ బలం చూపిస్తామని జనసేన అంటోంది. ఒంటరిగా వెళ్ళి వీరమరణం చెందాలా అంటూ మరో ప్రశ్నను పవన్ కళ్యాణ్ తెరపైకి తెస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే ప్రకటించారు. ఆయనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కోడతా అంటూనే.. బాబుతో మైత్రి సాగిస్తున్నారు. కానీ.. సిఎం కేఎసీఆర్ పవన్ కి వెయ్యి కోట్లు ఆఫర్ అంటూ ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన వార్తపై పవన్ ఇప్పటికీ స్పందించలేదు. దీంతో వైసీపీ మరోమారు పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తున్నారు. జనసేన పార్టీని వేలం పెట్టారంటూ .. తాజాగా అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, టిడిపి ఏది ఎక్కువ పాడితే వారికే జనసేన అంటూ అంబటి విమర్శలు గుప్పించారు.

నిజానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఓ రేంజ్ లోకి తీసుకురావని ఉంటే.. వేరే పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారని స్వయంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే పవన్ ను నిలదీస్తున్నారు. ఏపీకి సీఎం కావాలని పవన్ భావిస్తున్నారు. అలా భావించడంలో ఏ మాత్రం తప్పు లేదనుకోండి. ఆయన సిఎం అభ్యర్ధిగా ఉండే అర్హతా ఉందా అంటూ స్వయంగా టిడిపి నాయకులే ప్రశ్నిస్తున్నారు. జనసేన పార్టీకి పట్టుమని పది సీట్లు కూడా రావు అలాంటిది.. పవన్ కళ్యాణ్ కి అధికారం ఎలా కట్టబెడతామంటున్నారు. ఈ నాలుగేళ్ళ విలువైన కాలాన్ని పవన్ కళ్యాణ్ పెద్దగా ఉపయోగించుకోలేదని విమర్శలు ఉన్నాయి. అంతే కాదు పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి డెవలప్ చేయడానికి పెద్దగా ప్రయత్నం చేసినట్లుగా కనిపించడంలేదని అంటున్నారు. దీనికి నిదర్శనం జనసేనలో ఉన్న కీలక నేతలు ఆ పార్టీని వీడి వేరే పార్టీలోకి చేరడం, జనసేనలో చేరుతారు అనుకున్న కన్నా, వంగవీటి రాధా టిడిపి లో కొనసాగటం.. ఇదంతా పవన్ కళ్యాణ్ గ్రాఫ్ తగ్గటమేనని అంటున్నారు. పలు సర్వేలు కూడా పవన్ గ్రాఫ్ తగ్గుతూ వస్తుందని వెల్లడిస్తున్నాయి. మరి పవన్ జనసేన ఆవిర్భావ సభా ముఖంగా పొత్తులపై ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.