1.అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత పాటించాలి..
విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహం, స్మృతివనం పనులపై అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు.
2.నామినేషన్లు దాఖలు చేసిన ఏడుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు..
బీ ఫారమ్స్ అందజేసిన సీఎం జగన్.
3.వివేకా కేసులో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అవినాశ్ రెడ్డి..
ఆడియో, వీడియో రికార్డింగ్ కు ఆదేశించాలని విజ్ఞప్తి.. సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని వినతి
4.రాజకీయ సాధికారత దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు..
విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నారంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశంసలు.
5.ఏపీలో మందుబాబులకు షాక్..
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి విశాఖ, విజయనగర, శ్రీకాకుళం జిల్లాల్లో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేత.
6.ఉద్యోగుల జీవితాలతో ఏపీ ప్రభుత్వం చెలగాటమాడుతోంది..
రోడ్డెక్కి ఉద్యమాలు చేసే పరిస్థితికి వారిని తీసుకొచ్చిందని సోము వీర్రాజు విమర్శలు.
7.జగన్ కు అనుకూలంగా వ్యవహరించే అధికారులు జైలుకు వెళ్లడం ఖాయం..
రాష్ట్రంలో జగన్ రాజ్యాంగం నడుస్తోందన్న బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి
8.టీడీపీ అధికారంలోకి రాగానే చేనేతపై జీఎస్టీ ఎత్తివేస్తాం..
బీమా, వడ్డీ లేని రుణాలు ఇస్తామని పాదయాత్రలో లోకేష్ హామీ.
9.సర్కారుకు ఉద్యోగ సంఘాలు షాక్..
ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయం..
10.జగన్కు ఎమ్మెల్సీ ఎన్నికల భయం పట్టుకుంది..
అందుకే దొంగ ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని నిమ్మల రామానాయుడు ఆరోపణ.