వంగలపూడి అనితకు టీడీపీ షోకాజ్ నోటీసులు సోషల్ మీడియాలో వైరల్

1.గత ప్రభుత్వం మాటలకే పరిమితమైంది…చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు ఇన్ని అవకాశాలు ఇవ్వలేదు..
సీఎం జగన్ సామాజిక సాధికారతను చేతల్లో చూపుతున్నారని ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రశంస.

2.మొత్తం 5 లక్షల నాణ్యమైన ట్యాబ్లు ఇవ్వటం ద్వారా రాష్ట్రంలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టారు..
ప్రతి రంగానికీ టెక్నాలజీని జోడిస్తున్న సర్కారు.

3.పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
లైంగిక వేధింపుల నివారణకు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు ప్రధాన భూమిక పోషిస్తాయని ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్పష్టం.

4. ఈ వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాo..
సీఎం జగన్ ఆదేశాలతో ప్రణాళికాబద్దంగా వేసవి డిమాండ్ని అధిగమిస్తామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడి.

5.దస్తగిరి అక్కడా ఇక్కడా విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ జరుపుతోంది..
తనకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవన్న అవినాశ్ రెడ్డి.

6.ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు…
ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ

7.టీడీపీ నేత అనితకు టీడీపీ షోకాజ్ నోటీసులు ఇచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్..
తాను మాట్లాడిన మాటలు ఎడిట్ చేశారన్న అనిత.. అంతా ఫేక్ అంటూ ఖండించిన టీడీపీ

8.500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న లోకేశ్ పాదయాత్ర
ప్రస్తుతం మదనపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న యువగళం

9.14న జనసేన ఆవిర్భావ సభ కోసం వారాహి వాహనంలో మచిలీపట్నం వెళ్లనున్న పవన్ కల్యాణ్
12న కాపు ఉద్యమ నేత హరిరామజోగయ్య, కాపు నేతలు పవన్ కల్యాణ్ తో భేటీ

10.ఏపీలో నిరుపేదలు ఎవరైనా ఉన్నారా అంటే అది బుగ్గన మాత్రమే..
అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని… ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సెటైర్లు.