పవన్ రాజకీయాలలో నేగ్గేదే లే సోషల్ మీడియాలో ట్రోల్స్

రాజకీయాలలో పవన్ కళ్యాణ్ రాజకీయాలు వేరయా.. అనేంతలా ఆయన రాజకీయాలు ఉన్నాయని రాష్ట్ర ప్రజలందరూ కోడై కూస్తున్నారు. అదేంటో గాని పవన్ కల్యాణ్ విషయంలో అంతా విమర్శలకు తగినట్లుగానే ఆయన కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి. అదే ఆయనకు మరింత ఇబ్బందిగా మారింది. ఆయన చేసేది గాలి విమర్శలా..? గట్టి ఆరోపణలా? అన్నది భవిష‌్యత్ తేల్చనుంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభను మచిలీపట్నంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ పై మరోసారి ట్రోల్స్ విపరీతంగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎప్పుడో దసరాకు తన పర్యటను ప్రారంభిస్తానని చెప్పారు. అయితే అది వాయిదా పడింది. తర్వాత వారాహి వాహనాన్ని సిద్ధం చేశారు. అదిగో వస్తున్నా… ఇదిగో వస్తున్నా అంటూ వాయిదా వేస్తూనే ఉన్నారు. ఒక డేట్ అంటూ ఇంతవరకూ ఫిక్స్ కాలేదు. వారాహికి పూజలు చేసిన పవన్ ఎందుకు బయలుదేరలేదంటే ఏం సమాధానం చెబుతారు? లోకేష్ పాదయాత్ర ప్రారంభమయిన నాటి నుంచి ఏపీకి పవన్ ఎందుకు రావడం లేదు? కేవల౦ లోకేష్ పాదయాత్ర కోసమే.. పవన్ వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నారా లోకేష్ పాదయాత్ర ఒక కొలిక్కి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ పాదయాత్ర మొదలు పెడతారంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అసలు బస్సు యాత్ర చేస్తానని ప్రకటించి.. వాయిదాలు వేస్తే.. ప్రతిపక్షాలు సెటైర్లు వేయకుండా ఎలా ఉంటారు..? ఏదైనా ప్రకటిస్తే ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాలి. అంతే తప్ప వాయిదాలు వేసుకుంటూ పోతే ఇలాంటి విమర్శలే ఎదుర్కొనాల్సి వస్తుంది. ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్న తర్వాత సొంతంగా ఎదగాలని ఎవరైనా భావిస్తారు. ఒకరికి అండగా నిలిచి.. మరొకరిని ముఖ్యమంత్రిని చేయాలని ఎవరూ అనుకోరు. కానీ పవన్ మాత్రం ఆ విషయంలో కొంత ఫ్యాన్స్ ను కూడా నిరాశపరుస్తున్నారు. పవన్ రాజకీయాలలో నేగ్గేదే లే అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆవిర్భావ సభ విషయానికొస్తే.. మార్చి 14న నిర్వహిస్తున్న సభలో పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇస్తారా..? కాపుల సమావేశంలో ఎలాంటి చర్చలు జరపబోతున్నారు..? హరిరామ జోగయ్యతో భేటీలో ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటారా..? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు ప్రజల్లో చక్కర్లు కొడుతున్నాయి.