పవన్ విలన్ క్యారెక్టర్…చేసిందేమీ లేదన్న లోకేష్

1. ఈ కేసులో సీబీఐ విచారణ తప్పుదోవపడుతోంది.
తప్పుడు సాక్ష్యాలతో అమాయకులను ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం.

2.స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఈడీ దూకుడు..
ఈ కేసులో సిమెన్స్ మాజీ ఎండీ శేఖర్ బోస్ సహా నలుగురు అరెస్ట్.. జ్యుడిషియల్ రిమాండ్ను విధించిన విశాఖ స్పెషల్ కోర్టు.

3.సీఎం జగన్ అధ్యక్షతన బ్యాంకర్ల కమిటీ సమావేశం..
పలు కీలక అంశాలపై చర్చ.

4. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఏకపక్షంగా విచారణ చేస్తోంది ..
ఈ కేసులో కీలక వ్యక్తి అయిన దస్తగిరికి సీబీఐ మద్దతు ఇస్తోందని కడప మేయర్ సురేష్ బాబు వ్యాఖ్య.

5.వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు..
ఏ పార్టీలో చేరాలనే దానిపై ఆయన తన అనుచరులతో సమావేశమై చర్చ.

6.నేను మాట్లాడడం మొదలుపెడితే ఒక్కొక్కడి అకౌంట్ ఏంటో తెలుస్తుంది… విని తట్టుకోగలరా?
రాఘవేంద్రరావు, నాగబాబు వ్యాఖ్యలకు తమ్మారెడ్డి భరద్వాజ కౌంటర్.

7.నాలుగేళ్లు పూర్తవుతున్నా… జగన్‌కు అభివృద్ధిపై ఆలోచన లేదు..
కూల్చివేతలు, ఉన్నకంపెనీలను బెదిరించి పంపడం తప్ప ఆయన చేసిందేమీ లేదని లోకేష్ విమర్శ.

8.లోకేష్ పాదయాత్ర’లో జేబు దొంగల హల్ చల్..!
తమ పర్సులు పోగొట్టుకున్నామని పలువురు టీడీపీ నేతలు ఆవేదన.

9.రాయలసీమలో టీడీపీకి 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరు..
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్యారెక్టర్.. ‘రంగం’ అనే తమిళ్ డబ్బింగ్ సినిమాలో విలన్ వంటిదని బైరెడ్డి సెటైర్లు

10.ఒక్కో టీచర్‌కు 5 వేలు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధపడుతోంది..
అవినీతి డబ్బుతో టీచర్ల ఓట్లను కొనేందుకు సిద్ధమయ్యారని చంద్రబాబు సంచలన ఆరోపణలు.