1.ఎల్రక్ట్రానిక్స్ అండ్ డిజైనింగ్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆకర్షిస్తున్న పెట్టుబడులు..
విశాఖ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో 15,711 కోట్ల విలువైన 23 ఒప్పందాలు జరిగినట్లు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడి.
2. చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..
దమ్ముంటే ఈ నెల 12న చర్చకు రావాల౦టూ నారా లోకేష్ కి ఎంపీ మిథున్ రెడ్డి సవాల్.
3.వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఉద్యోగుల జీతాల విషయంలో ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు..
నెలాఖరులోగా పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం అంగీకరించిందని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం.
4.ఓటు కోసం ఉపాధ్యాయుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ..
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న చామల వెంకట అనిల్‌కుమార్ రెడ్డి అరెస్ట్.
5. వైఎస్ వివేకా కేసులో ఏ-4గా ఉన్న దస్తగిరి విచారణకు ఎందుకు రాలేదు..
సీబీఐని ప్రశ్నించిన ప్రత్యేక న్యాయస్థానం.
6. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ నిధుల మళ్లింపు వ్యవహారంలో ఏపీ వ్యాప్తంగా సీఐడీ తనిఖీలు..
మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లలోనూ సీఐడీ సోదాలు. సీఐడీ అదుపులో విజయవాడ మార్గదర్శి మెయిన్ బ్రాంచ్ మేనేజర్.
7.ఏపీలో ఏప్రిల్ 3 నుంచి పది పరీక్షలు..
పరీక్ష కేంద్రాలకు ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, బ్లూటూత్ సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని విద్యాశాఖ కమిషనర్ వెల్లడి.
8. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషా సోదరుడు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా..
పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన లోకేశ్
9.మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై..
బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని టాక్.
10.వంగలపూడి అనితపై టీడీపీ జాతీయ కార్యాలయం పేరిట ఫేక్ లెటర్ తో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోండి.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పై టీడీపీ మహిళా విభాగం పిర్యాదు..