1.ఏపీలో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..
మొత్తం 1,538 పోలింగ్ స్టేషన్లలో కొనసాగుతున్న ఎన్నికలు.
2.ఉద్యోగులకు బకాయిల చెల్లింపు ప్రారంభం..
నేడు ఏపీజీఎల్ఎ క్లెయిమ్స్ నగదు ఉద్యోగుల ఖాతాల్లో జమ
3.చంద్రబాబు పరిపాలన కాలంలోనే ఎన్నో కుంభకోణాలు జరిగాయి..
రాజధాని పేరుతో రియల్ కుంభకోణానికి పాల్పడిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మంత్రి విడదల రజిని ఆరోపణ.
4. చిత్తూరు అభివృద్ధిపై సవాల్ విసిరిన లోకేష్ పారిపోయాడు..
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెటైర్లు.
5.భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది..
తెలుగోళ్లు అవార్డును అందుకోవడం చూసి తెలుగు ప్రేక్షకుల గుండెలు ఉప్పొంగుతున్నాయని పవన్ భావోద్వేగం.
6.కాసేపు కాపు అంటాడు.. మరోసారి బీసీ అంటాడు, అసలు పవన్‌ది ఏ కులం..
పవన్ రోజుకో మాట, పూటకో వేషం వేస్తాడని.. జనసేన పనికిమాలిన పార్టీ అని చంద్రబాబుకు భజన చేయడమేనంటూ వెల్లంపల్లి విమర్శలు.
7.రేపటి నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..
మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత సమావేశాలు.. ఫైనాన్స్ బిల్లు ఆమోదం, విపక్షాల డిమాండ్లపై చర్చకు అవకాశం
8.కోటంరెడ్డికి మరో షాక్..
ఆయన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని వైసీపీ నుండి తొలగింపు.
9.మార్గదర్శి సంస్థ విజయవాడ ఎంజీ రోడ్డు బ్రాంచ్ మేనేజర్ బండారు శ్రీనివాసరావుకు 14 రోజులపాటు రిమాండ్ ..
విజయవాడ సబ్‌జైలుకు తరలింపు.
10. నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది..
చిత్ర బృందం మొత్తానికి చంద్రబాబు అభినందనలు