ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌ను ఆస్కార్ వరించింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాట పాట ఆస్కార్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక ఈ నేపధ్యంలోనే రాజకీయ నాయకులు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు పాట అవార్డు గెలుచుకోవడం సంతోషం. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన ఈ పాట చరిత్ర సృష్టించింది. గ్లోబల్ ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేసిన పాట ఇది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండాను రెపరెపలాడే విధంగా చేసింది. ఇటీవలే శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న భారత సినిమాకు ఈ అవార్డు మరింత ప్రోత్సహకాన్ని ఇచ్చింది’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
తెలుగు పాట ఈ ఘనత సాధించటం భారతీయ సినిమాకు గర్వకారణమన్నారు. రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రాంచరణ్, సింప్లీగంజ్, చంద్రబోస్, ప్రేమరక్షిత్, కాలభైరవ చిత్ర బృందం మొత్తానికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఉత్తమ షార్ట్ ఫిలిం విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ బృందానికి చంద్రబాబు శుభాభినందనలు తెలియజేశారు.
భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కిందని… అది తెలుగు సినిమా ద్వారా దక్కడం గర్వకారమని పవన్ అన్నారు. ఆస్కార్ వేదికపై తెలుగు పాట వినిపించడం, తెలుగోళ్లు అవార్డును అందుకోవడం చూసి తెలుగు ప్రేక్షకుల గుండెలు ఉప్పొంగుతున్నాయని అన్నారు. ఇవి యావత్ భారతదేశం గర్విస్తున్న క్షణాలని పవన్ పేర్కొన్నారు.